Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సుకాదు.. కామాంధురాలు... : బాత్రూమ్‌లో కోవిడ్ రోగితో శృంగారం!

Webdunia
శుక్రవారం, 1 జనవరి 2021 (19:03 IST)
కరోనా వైరస్ అంటేనే ప్రజలు వణికిపోయే పరిస్థితి నెలకొంది. ఈ వైరస్ బారినపడుకుండా ఉండేందుకు అనేక రకాలైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా, భౌతిక దూరం పాటిస్తూనే, ముఖానికి మాస్క్ తప్పకుండా ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలంటూ వైద్యులు సలహా ఇస్తున్నారు. అలాగే, కరోనా వైరస్ బారినపడినవారిని ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. అలా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఏకాంతంగా ఉంచిన పిమ్మట.. మరోమారు కోవిడ్ టెస్ట్ చేసి, నెగెటివ్ అని ఫలితం వచ్చిన తర్వాతే బాహ్య ప్రపంచంలోకి అనుమతిస్తున్నారు. కానీ, ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఓ నర్సు కోవిడ్ రోగితో ఏకంగా ఆస్పత్రి బాత్రూమ్‌లో శృంగారంలో పాల్గొంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇండోనేషియా దేశం జకార్తా రాజధానిలోని విస్మా అట్‌లెట్ క్వారంటైన్ సెంటరు ఉంది. ఇక్కడ ఓ నర్సు విధులు నిర్వహిస్తోంది. ఈమె కొవిడ్-19 పాజిటివ్ వచ్చిన వ్యక్తితో బాత్రూమ్‌లో శృంగారంలో పాల్గొంది. ఇందుకోసం కొవిడ్ వార్డులో అన్ని సమయాల్లో ధరించాల్సిన పీపీఈ కిట్‌ను శృంగారానికి అడ్డొందని భావించి తొలగించింది. 
 
ఈ విషయాన్ని నర్సుతో సెక్స్ చేసిన కొవిడ్ షేషెంట్ సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. వీరిద్దరూ కలిసి గుట్టుగా చేసుకున్న చాటింగ్ స్క్రీన్ షాట్స్‌ను కూడా షేర్ చేశాడు. అది కాస్త వైరలైంది. 
 
పైగా, ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఆస్పత్రి వర్గాల చెవిన పడటంతో ఆ నర్సును విధుల నుంచి తప్పించారు. ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదు మేరకు లెఫ్ట్‌నెంట్ కల్నల్ హర్విన్… నర్సుతో పాటు కొవిడ్ షేషెంట్‌ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. 
 
ఆ తర్వాత కేసును సెంట్రల్ జకార్తా పోలీసులకు బదిలీ చేశామన్నారు. నర్సును తదుపరి విచారణ కోసం రిమాండ్‌లో ఉంచగా.. కొవిడ్ షేషెంట్‌ను ఐసోలేషన్ సెంటర్‌కు తరలించినట్లు కల్నల్ హర్విన్ స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం