Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా అలాంటి వారికి బాగా కలిసొచ్చిందట.. శృంగారంలో హైదరాబాద్..?

Advertiesment
కరోనా అలాంటి వారికి బాగా కలిసొచ్చిందట.. శృంగారంలో హైదరాబాద్..?
, బుధవారం, 30 డిశెంబరు 2020 (09:02 IST)
కరోనా కారణంగా ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కానీ ఈ కరోనా శృంగార ప్రియులకు మాత్రం బాగానే కలిసివచ్చింది. కరోనాని కట్టడి చేసేందుకు కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ కొన్నిదశల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌, విద్యాసంస్థలతోపాటు కొన్ని కీలక సంస్థలు ఇంకా తెరుచుకోలేదు. ఐటీ కంపెనీలు వచ్చే ఏడాది కూడా వర్క్‌ ఫ్రం హోమ్‌ కొనసాగించేలా ఉన్నాయి.
 
కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్‌లో సాగుతుండటంతో.. ఈ మార్పును క్యాష్‌ చేసుకున్నాయి కొన్ని సర్వీస్‌ సంస్థలు. లాక్‌డౌన్‌ టైంలో పట్టపగలే శృంగార కార్యకలాపాలు బాగా పెరిగిపోయాయని తాజా సర్వేలో వెల్లడి అయ్యింది. జనం బయట తిరిగే అవకాశం లేకపోవడంతో... ఆన్‌లైన్‌ ఆర్డర్లకు విపరీతమైన డిమాండ్‌ లభించింది. ఆన్‌లైన్లో కండోమ్స్‌ ఆర్డర్స్‌ గతం కంటే రెట్టింపయ్యాయి. 
 
స్ట్రిక్ట్‌ లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంలోనూ... మెడికల్‌ సంబంధిత వస్తువులు అందుబాటులో ఉన్నాయి. జనం కొనుగోలు చేసిన వస్తువుల్లోనూ కండోమ్స్‌, ఐపిల్స్‌ షేరే ఎక్కువ. కండోమ్స్‌ , గర్భ నిరోధక మాత్రలైన ఐపిల్‌, పేపర్‌ రోల్స్‌ డెలివరీలు ఐదారింతలు పెరిగిపోయాయని చెప్తోంది ప్రముఖ ఆన్‌లైన్‌ సర్వీస్ యాప్‌ డాంజో. ఆన్‌లైన్‌ కస్టమర్ల బిహేవియర్‌పై ఓ రిపోర్టు విడుదల చేసింది. ఆన్‌లైన్‌ డెలివరీ ట్రెండ్‌ 2020 ప్రకారం ఈ ఏడాదిలో రాత్రిపూట కంటే.. పగటిపూటే కండోమ్స్‌ ఆర్డర్‌లు సగటున మూడింతలు పెరిగాయి.
 
డాంజో యాప్‌ ద్వారానే.. ఈ స్థాయిలో పగటిపూట కండోమ్స్‌ కొన్నారంటే.. మిగతా అన్ని యాప్‌లను కలిపితే లాక్‌డౌన్‌లో పగటిపూట రతిక్రీడలు ఏ స్థాయిలో జరిగాయో ఊహించుకోవచ్చు. ఇవే కాకుండా.. కుటుంబ నియంత్రణ ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేసినట్లు సర్వే రిపోర్ట్‌ చెప్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో మాత్రం ఒక్క కండోమ్స్‌ గిరాకీనే అది కూడా పగటిపూట ఆర్డర్లు ఆరింతలు పెరిగాయి. 
 
హైదరాబాద్‌లో 6 రెట్లు, చెన్నైలో 5 రెట్లు, జైపూర్‌ సిటీలో నాలుగు రెట్లు కండోమ్‌ కొనుగోళ్లు పెరిగినట్టు చెప్తోంది డాంజో. బెంగుళూరులో మాత్రం... పొగాకు, డ్రగ్స్‌ను సిగరెట్లుగా చుట్టిపీల్చే రోలింగ్‌ పేపర్‌ వాడకం విపరీతంగా పెరిగిందని సర్వే మాట. చెన్నైకంటే.. బెంగుళూరులో 22 రెట్లు ఎక్కువగా రోలింగ్‌ పేపర్ల ఆర్డర్లు వచ్చాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కొత్త స్ట్రెయిన్‌.. దేశంలో వణికిపోతున్న ప్రజలు.. ఆరుగురికి పాజిటివ్