Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా యాప్‌లపై నిషేధం.. ఇకపై చైనా ఏసీలపై కూడా.... త్వరలో అమలు

Webdunia
బుధవారం, 1 జులై 2020 (08:20 IST)
తూర్పు లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో చైనా సైనికులు బరితెగించి 21మంది భారత సైనికులను పొట్టనబెట్టుకుంది. ఈ చర్యపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చైనా వస్తువులన్నింటిపై నిషేధం విధించాలన్న డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చైనాకు చెందిన 59 యాప్‌లపై భారత్ నిషేధం విధించింది. 
 
ఈ ప్రకటన చేసిన 24 గంటల్లోనే నిషేధం అమల్లోకి వచ్చింది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించిన కాసేపట్లోనే టిక్‌టాక్‌ సహా చైనాకు చెందిన 59 యాప్‌లు మూగబోయాయి. దీనికితోడు చైనా నుంచి దిగుమతి చేసుకొనే ఏసీలు, టీవీలు సహా 12 రకాల వస్తువులను నియంత్రించాలని భారత్‌ యోచిస్తోంది. 
 
వీటిని దిగుమతి చేసుకోవడానికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి వస్తుందని అంటున్నారు. నిజానికి ఈ లైసెన్స్‌ పద్ధతికి కొద్ది నెలల క్రితమే తెర లేచింది. వివిధ దేశాల నుంచి అగరువత్తులు, టైర్లు, పామాయిల్‌ దిగుమతి చేసుకోవడానికి లైసెన్స్‌ తప్పనిసరి చేశారు. లద్దాఖ్‌ ఘర్షణల తర్వాత ఈ జాబితాలోకి చైనా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకొనే ఏసీలు, టీవీలు, వాటి విడిభాగాలు వచ్చి చేరబోతున్నాయి.
 
దేశీయంగా వీటి ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం లైసెన్సింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. దిగుమతి సుంకాన్ని భారీగా విధించడం, విడి భాగాల తయారీలో కనీస సాంకేతిక ప్రమాణాలను నిర్దేశించడం, కొన్ని రకాల వస్తువులను కొన్ని రేవుల ద్వారా మాత్రమే దిగుమతి చేసుకోవాలని షరతులు విధించడం ద్వారా దిగుమతులను నిరుత్సాహపరుస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments