అమెరికాలో నీచ డాక్టర్.. 13వేలకు పైగా అలాంటి వీడియోలు... భార్యే ఆ పని చేసింది..

సెల్వి
గురువారం, 22 ఆగస్టు 2024 (14:05 IST)
అమెరికాలో ఓ నీచ డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారులు, మ‌హిళ‌ల న‌గ్న చిత్రాల‌ను రికార్డ్ చేస్తున్న ఓ భార‌త సంతతికి చెందిన డాక్టర్‌ను అత‌ని భార్యనే పోలీసుల‌కు ప‌ట్టించింది.  ఆస్పత్రి పరిసరాలు, గ‌దులు, బాత్రూంల్లో ర‌హ‌స్య కెమెరాలు అమర్చి, ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేస్తున్న ఉమేర్ ఏజాజ్‌ అనే వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూర్ హార్డ్ డిస్క్‌లో 13వేలకు పైగా వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  
 
2011లో వర్క్ వీసాపై ఇండియా నుంచి అమెరికా వెళ్లిన ఒయిమెయిర్ ఎజాజ్ అలబామాలో కొన్నేళ్లపాటు నివాసం ఉన్నాడు. 2018లో మిషిగాన్‌కు మకాం మార్చాడు. అక్కడ పలు ఆసుపత్రుల్లో ఫిజీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే పనిచేసే ప్రతీచోట రహస్యంగా కెమెరాలు అమర్చి మహిళల నగ్న వీడియోలను చిత్రీకరించాడు. అలా రికార్డు చేసిన చిత్రాలను తన కంప్యూటర్ హార్డ్‌ డిస్క్‌ల్లో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. 
 
అయితే ఈ విషయం అతని భార్యకు తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు, అతని ఇంటిని సోదా చేశారు. ఈ వీడియోల భాగోతం బయటపడింది. నిందితుడు ఉమేర్ ఏజాజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం