Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి సేవలో మెగాస్టార్ దంపతులు... వీరాభిమాని పొర్లు దండాలు

Advertiesment
Chiru-Cherry

సెల్వి

, గురువారం, 22 ఆగస్టు 2024 (13:52 IST)
మెగాస్టార్ చిరంజీవి తన బర్త్ డే సందర్భంగా ఆయన సతీ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. చిరంజీవి దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలను అందజేశారు. 
 
1955 ఆగస్ట్ 22న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో చిరంజీవి జన్మించారు. మరోవైపు తమ అభిమాన నటుడి జన్మదినాన్ని పురస్కరించుకుని మెగ్యా ఫ్యాన్స్ భారీ కార్యక్రమాలను చేపడుతున్నారు. రక్తదానం, అన్నదానం తదితర సేవాకార్యక్రమాలను చేస్తున్నారు. విదేశాల్లో సైతం చిరు అభిమానులు ఆయన జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు. 
 
అయితే తిరుపతి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మాత్రం చిరంజీవిపై వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్నారు. మెగాస్టార్ పుట్టినరోజును పురస్కరించుకొని శ్రీవారి మెట్టు మార్గం గుండా పొర్లుదండాలు పెడుతూ తిరుమలకు చేరుకుని మొక్కలు చెల్లించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. 
 
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ చిరంజీవికి వీరాభిమాని. మెగాస్టార్ కుటుంబం బాగుండాలని కోరుకుంటూ గత 21 ఏళ్లుగా ప్రతి ఏడాది పొర్లు దండాలు పెడుతూ శ్రీవారిని దర్శించుకుంటున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అస్వస్థతకు గురైన కవిత.. ఢిల్లీ ఎయిమ్స్‌‌లో చేరిక