Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌కు భారత్ సాయం : 5 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసుల‌ు తరలింపు

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (19:57 IST)
ఆప్ఘనిస్థాన్‌కు భారత్ సాయం చేసింది. క‌రోనా స‌మ‌యంలో భార‌త్ అనేక దేశాల‌కు మాన‌వ‌తా దృక్ప‌దంలో స‌హాయం చేసింది. అమెరికాతో స‌హా అనేక దేశాల‌కు మందుల‌ను స‌ప్లై చేసింది. తాజాగా తాలిబ‌న్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న ఆప్ఘనిస్థాన్‌కు కూడా సాయం అందించింది. 
 
ఇటీవ‌లే ఇండియా నుంచి గోధుమ‌ల‌ను కూడా ఆఫ్ఘ‌నిస్తాన్‌కు ఉచితంగా ఎగుమ‌తి చేసింది. అదే విధంగా ఇప్పుడు 5 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసుల‌ను ఆఫ్ఘ‌న్‌కు అందించింది.  శనివారం ఉద‌యం ఇండియా నుంచి స్పెష‌ల్ విమానంలో ఈ వ్యాక్సిన్‌ల‌ను కాబూల్‌కు చేర్చారు.  కాబూల్‌లోని ఇందిరాగాంధీ ఆసుప‌త్రికి ఈ వాక్సిన్ డోసుల‌ను త‌ర‌లిస్తున్నారు. 
 
కేవలం వ్యాక్సిన్ డోసులను మాత్రమే కాకుండా.. ఆఫ్ఘన్ ప్రజలకు ఆహార ధాన్యాలు మరియు అవసరమైన ప్రాణాలను రక్షించే మందులను కూడిన అందించడానికి భారతదేశం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
"గత నెలలో 1.6 టన్నుల మెడికల్ ఎక్విప్ మెంట్ పంపించాం. రాబోయే వారాల్లో గోధుమల సరఫరా మరియు మిగిలిన వైద్య సహాయాన్ని చేపట్టనున్నాం. ఈ విషయంలో రవాణాకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడానికి ఐక్యరాజ్యసమితితో సంప్రదింపులు జరుపుతున్నాం" అని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments