Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహారాష్ట్ర: 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా

Advertiesment
మహారాష్ట్ర: 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా
, శనివారం, 1 జనవరి 2022 (12:05 IST)
దేశంలో కరోనా వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో చాపకింద నీరులా ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. తాజాగా 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. 
 
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రమైతే కఠినమైన ఆంక్షలను విధిస్తామని .. శుక్రవారం ఒక్క రోజే మహారాష్ట్రలో కొత్తగా 8,067 కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పుకొచ్చారు. 
 
న్యూ ఇయర్, బర్త్ డేలు, మరే అకేషన్ అయినా సరే సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరించారు.  ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా స్ప్రెడ్ అవుతోందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
 
కోరెగావ్-భీమా పోరాటం జరిగి 204 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పెర్నా గ్రామంలో జయస్తంభ సైనిక స్మారకాన్ని అజిత్ పవార్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
 
మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. రోజువారీ కేసులు ఇలాగే పెరిగితే కఠిన ఆంక్షలు తప్పవు.. అలా జరక్కుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనల్ని పాటించాలని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా, 24 గంటల్లో 22,775 కేసులు నమోదు