Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం : మహారాష్ట్రలో నమోదు!

దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం : మహారాష్ట్రలో నమోదు!
, శుక్రవారం, 31 డిశెంబరు 2021 (09:51 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ బారినపడిన రోగి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశంలో నమోదైన తొలి మరణం. ఈ కేసు కూడా మహారాష్ట్రలో నమోదైంది. నైజీరియా నుంచి వ్యక్తికి ఈ వైరస్ సోకడంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్చి చికిత్స పొందుతూ రాగా, ఆ రోగి మృతి చెందినట్టు వైద్యులువెల్లడించారు.
 
అయితే, అధికారులు మాత్రం ఈ మరణాన్ని ఒమిక్రాన్ మరణంగా చూడొద్దని కోరుతున్నారు. ఈ రోగికి ఇతర అనేక జబ్బులు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. దీనిపై వైద్యులు స్పందిస్తూ యశ్వంత్ రావు చవాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఓ రోగి ఈ నెల 28వ తేదీన మృతి చెందారు. ఈ రోగికి 13 యేళ్లుగా చక్కెర వ్యాధి వుంది. అలాగే, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చారు. అందువల్ల ఒమిక్రాన్ మరణంగా చూడొద్దని కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంబేద్కర్ వల్ల మనకు వచ్చిన హక్కులు శూన్యం : వైకాపా ఎమ్మెల్యే శ్రీదేవి