Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అచ్చే దిన్ కాదు.. ఆకలి భారతం"... 119 దేశాల్లో 100వ స్థానంలో భారత్‌

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. పైగా, అగ్రదేశాలతో పోటీపడుతుందనే అనే మాటలు చాలా కాలంగా వినిపిస్తున్నవి. కానీ అదేసమయంలో దేశంలో ఆకలికేకలు మిన్నంటుతున్నాయి.

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (09:34 IST)
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. పైగా, అగ్రదేశాలతో పోటీపడుతుందనే అనే మాటలు చాలా కాలంగా వినిపిస్తున్నవి. కానీ అదేసమయంలో దేశంలో ఆకలికేకలు మిన్నంటుతున్నాయి. అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (ఐఎఫ్పీఆర్ఐ) తాజాగా ప్రకటించిన ప్రపంచ ఆకలి సూచిలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ ఆకలి సూచీలో పేర్కొన్న 119 దేశాల్లో భారత్‌ 100వ స్థానంలో ఉండటం ప్రతి ఒక్కరూ తలదించుకునేలా ఉంది. 
 
ముఖ్యంగా, ప్రపంచంలో పోషకాహార లేమితో బాధపడుతున్న పిల్లలు, సరైన బరువులేని పిల్లలు భారత్‌లోనే ఎక్కువగా ఉన్నారని ప్రపంచ ఆకలి సూచి నివేదిక పేర్కొంది. ఐదేళ్ల లోపు చిన్నారుల్లో 21 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడటంతో పాటు సరైన బరువు కూడా లేరని వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ ఆహార సూచిలో భారత్‌ స్కోరు 31..4గా ఉంది. ఈ స్కోరు 28.. 5కు చేరితే పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది.
 
ప్రపంచ ఆకలి సూచీలో భారత్ 100వ స్థానంలో ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న చైనా 29వ స్థానంలో ఉంది. నేపాల్ -72, మయన్మార్-77, ఇరాక్ -78, బంగ్లాదేశ్- 88, ఉత్తరకొరియా 93వ స్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్ 106వ స్థానంలో ఉండగా,ఆఫ్ఘానిస్థాన్ 107వ స్థానంలో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments