Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూఢచర్యం ఆరోపణలు: పాక్‌లో మరో భారతీయుడి అరెస్టు

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (09:50 IST)
తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే ఆరోపణపై ఓ భారతీయుడిని పాకిస్థాన్ తాజాగా అరెస్టు చేసింది. రాజు లక్ష్మణ్ అనే వ్యక్తిని పంజాబ్ ప్రావిన్స్‌లోని డేరా ఘాజీ ఖాన్ జిల్లాలోని రాఖీగజ్ ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు పాక్ పోలీసులు వెల్లడించారు. 

బెలూచిస్థాన్ ప్రావిన్స్‌ నుంచి డేరా ఘాజీ ఖాన్ జిల్లాలోకి ప్రవేశిస్తుండగా లక్ష్మణ్‌ను అరెస్టు చేసినట్టు పాక్ ప్రకటించింది. తానో గూఢచారినని రాజు లక్ష్మణ్ అంగీకరించాడనీ, అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు రాజుని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

కాగా గూఢచార్య ఆరోపణలపై భారత మాజీ నేవి అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను పాక్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనకు పాకిస్థాన్ సైనిక కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ శిక్షపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు స్టే విధించి, శిక్షను పునఃపరిశీలించాల్సిందిగా పాకిస్థాన్‌ సర్కారును ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments