Webdunia - Bharat's app for daily news and videos

Install App

థర్మామీటర్ పగిలిపోయింది.. క‌నురెప్ప‌పై పడిన నీటి తుంప‌ర గడ్డ‌క‌ట్టింది

కను రెప్పల మీద పడే నీటి తుంపర కూడా గట్టికట్టిపోయేంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయిన విషయం తెల్సిందే. ఫలితంగా ఈ తరహా ఉష్

Webdunia
శుక్రవారం, 19 జనవరి 2018 (14:32 IST)
కను రెప్పల మీద పడే నీటి తుంపర కూడా గట్టికట్టిపోయేంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయిన విషయం తెల్సిందే. ఫలితంగా ఈ తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో ప్ర‌పంచంలో అత్యంత చ‌లిగా ఉండే సైబీరియాలోని ఓమ్యాకోన్‌ గ్రామంలో -62 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. దీంతో అక్క‌డ ఏర్పాటు చేసిన థ‌ర్మామీట‌ర్ ప‌గిలిపోయింది. ఈ వారంలో చ‌లి తీవ్ర‌త పెర‌గ‌డంతో థ‌ర్మామీట‌ర్‌లో ప‌గుళ్లు వ‌చ్చాయ‌ని అక్క‌డి వాతావ‌ర‌ణ అధికారులు వెల్లడించారు. అంటార్కిటికాకాకుండా ఇత‌ర జ‌నజీవ‌న ప్రాంతాల్లో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త -67.7 డిగ్రీల సెల్సియ‌స్‌ కావడం గమనార్హం. 
 
ఉష్ణోగ్ర‌త‌లు ఇలాగే ప‌డిపోతే ఆ రికార్డును దాటే అవ‌కాశం ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అభిప్రాయ‌పడుతున్నారు. అక్క‌డి ఉష్ణోగ్ర‌త‌కి క‌నురెప్ప‌ల మీద ఉండే నీటి తుంప‌ర కూడా మంచులా మారిపోతోంది. అక్క‌డి య‌కుస్కు గ్రామంలో నివ‌సించే అన‌స్టేషియా అనే యువ‌తి తీసుకున్న సెల్ఫీ చూస్తే అక్క‌డి చ‌లి తీవ్ర‌త అర్థ‌మ‌వుతోంది. 
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments