ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? పీటీఐ నేత ఏమంటున్నారు...

ఠాగూర్
ఆదివారం, 30 నవంబరు 2025 (11:58 IST)
పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధినేత, క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్టు గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అవినీతి, దేశ ద్రోహం వంటి కేసుల్లో ఆయనను అరెస్టు చేసి రావల్పిండిలోని అదియాలా జైలులో బంధించివున్నారు. అయితే, ఆయన జైలులో అనుమానాస్పదంగా మృతి చెందినట్టు గత నెల రోజులుగా విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనిపై పీటీఐ సెనేటర్ ఖుర్రుం జీషన్ స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ జైలులో బతికేవున్నారని స్పష్టంచేశారు. అయితే, ఇమ్రాన్ దేశం విడిచి వెళ్లేలా ఒత్తిడి చేసేందుకే పాక్ ప్రభుత్వం ఈ తరహా చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. 
 
ఇమ్రాన్ ఖాన్ జనాదారణ చూసి ప్రస్తుత ప్రభుత్వం భయపడుతోంది. అందుకే ఆయన ఫోటోలుగానీ, వీడియోలు గానీ బయటకు రాకుండా జాగ్రత్త పడుతోంది. గత కొన్ని రోజులుగా ఆయన బతికే ఉన్నారని, జైలులో క్షేమంగా ఉన్నారని మాకు హామీ లభించింది అని వెల్లడించారు. ఇటీవల ఆప్ఘనిస్థాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీషల్ మీడియా ఖాతాల నుంచి ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో హత్య చేశారంటూ వార్తలు వ్యాపించిన విషయం తెల్సిందే. 
 
గత నెల రోజులుగా కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులను కూడా జైలు అధికారులు అనుమతించడం లేదని జీషన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘన. దేశం విడిచి వెళ్ళి, నిశ్శబ్దంగా ఉంటే కొన్ని రాయితీలు ఇస్తామని ప్రభుత్వం ఆయనతో ఒప్పందం చేసుకోవాలని చూస్తోందన్నారు. కానీ ఇమ్రాన్ ఖాన్ అలాంటి వాటికి ఎప్పటికీ అంగీకరించరని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నప్పటికీ దేశ వ్యాప్తంగా ఆయన ప్రభావం, ప్రజాదారణ ఏమాత్రం తగ్గలేదని జీషన్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

Satyaprakash: రాయలసీమ భరత్ నటించిన జగన్నాథ్ విడుదలకు సిద్ధం

Sai Durga Tej: డిస్కవర్ ఆంధ్ర టైటిల్, గ్లింప్స్ లాంఛ్ చేసిన సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments