Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంతకీ ఇమ్రాన్ ఖాన్ వున్నాడా? చంపేసారా? పాకిస్తాన్ చీలిపోతుందా?

Advertiesment
Imran Khan

ఐవీఆర్

, శనివారం, 29 నవంబరు 2025 (15:21 IST)
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రిని జైల్లో పెట్టారు. ఐతే ఆయనను పాక్ సైనికాధికారులు జైల్లోనే మట్టుబెట్టారంటూ పాకిస్తాన్ దేశంలో తీవ్రమైన అలజడి వార్తలు ప్రచారంలో వున్నాయి. ఐతే స్వయంగా ఇమ్రాన్ సోదరి జైలు వద్దకు వెళ్లి తన సోదరుడు బతికే వున్నాడా... జీవించి వుంటే తనకు చూపించాలని డిమాండ్ చేసినా ఇప్పటివరకూ ఇమ్రాన్ ఖాన్‌ను చూపించలేదు.
 
పైగా అతడు బ్రతికే వున్నాడనీ, జైలు నిబంధనలను అనుసరించి నేరగాడిని బైటకు చూపించరాదని పాక్ ప్రభుత్వాధికారులు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఐతే చాలామంది అనుమానం ఏమిటంటే... ఇమ్రాన్ ఖాన్ నిజంగానే చంపేసి వుంటారన్నది. దీనికితోడు తాజాగా పాకిస్తాన్ మాజీ ఎంపీ మౌలానా డీజిల్ చేసిన వ్యాఖ్యలు అక్కడి ప్రజలను మరింత ఆందోళనల్లోకి నెట్టివేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.
 
ఇంతకీ మౌలానా డీజిల్ ఏమన్నాడంటే.. పాకిస్తాన్ దేశంలో అంతర్భాగంగా వున్న బలూచిస్తాన్ ప్రావిన్సిలోని చాలా ప్రాంతాలు తమకు తాము స్వతంత్రులుగా ప్రకటించుకుంటున్నాయనేది. ఇదేవిధంగా బలూచిస్తాన్ ప్రాంతంలో వున్న నాయకులు ప్రకటించుకుంటూ వెళ్తే ఒకనాటికి పాకిస్తాన్ దేశం నిట్టనిలువుగా చీలిపోతుందని ఆందోళన వ్యక్తం చేసారు. కొన్నాళ్లకు ఐక్యరాజ్య సమితి కూడా బెలూచిస్తాన్ ప్రాంతాన్ని ఒక దేశంగా గుర్తిస్తే మరింత ముప్పు పెరుగుతుందని ఆయన అన్నారు. మొత్తమ్మీద పాకిస్తాన్ దేశంలో తలెత్తిన సంక్షోభం ఇరుగుపొరుగు దేశాలకు ఎంతమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీవారిదే భారం అంటూ తలపై మోయలేని భారంతో మెట్లెక్కుతూ మహిళ (video)