ఇమ్రాన్ ఖాన్ రాజకీయ జీవితం ఇక ముగిసినట్టేనా?

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (15:32 IST)
పాకిస్థాన్ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ జీవితానికి తెరపడనుంది. ఆయన అక్రమంగా విదేశీ నిల్వలు కలిగివున్నట్టు ఆ దేశ ఎన్నికల సంఘం ఆరోపించింది. నిజానికి ఇదే అంశంపై కొన్నేళ్ళుగా విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్‌కు విదేశీ నిల్వలు అందడమే కాకుండా, ఆయన కలిగివున్నట్టు సాక్షాత్ పాకిస్థాన్ దేశ ఎన్నికల సంఘం ఆరోపించింది. 
 
ఈ మేరకు పాక్ ఎన్నికల కమిషన్ రూలింగ్‌లో పేర్కొంది. దీంతో ఇప్పుడు ఇమ్రాన్‌, ఆయన పార్టీని పాక్‌ రాజకీయాల నుంచి నిషేధం విధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాక్‌ దేశ చట్టాల మేరకు రాజకీయ పార్టీలు విదేశీ నిధులు స్వీకరించడం నిషేధం. ఇపుడు ఇమ్రాన్, ఆయన పార్టీ  ఈ చట్టాన్ని ఉల్లంఘించనట్టు ఎన్నికల సంఘం ఆరోపించింది. 
 
అయితే, పాక్‌ ఎన్నికల కమిషన్‌ రూలింగ్‌ను తాము సవాలు చేస్తామని పీటీఐ (పాకిస్థాన్‌ తెహ్రీ ఇ ఇన్సాఫ్‌) ప్రతినిధి ఫవాద్‌ చౌధురి విలేకర్లకు వెల్లడించారు. తాము విదేశాల్లోని పాక్‌ జాతీయుల నుంచే నిధులు సేకరించామని ఆయన వెల్లడించారు. పైగా, ఇదేమీ చట్ట విరుద్ధంకాదన్నారు. కాగా, ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ మొత్తం 34 విదేశీ కంపెనీల వద్ద పార్టీ ఫండ్‌ పొందినట్లు ముగ్గురు సభ్యుల ట్రిబ్యూనల్‌ తేల్చింది. తమ పార్టీకి మొత్తం 13 ఖాతాలు ఉన్నాయని.. వాటి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments