తాచుపాము అనుకున్నాడు.. భార్య కాలిని విరగ్గొట్టాడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (14:37 IST)
పాము అనుకుని భార్య కాలిని విరగ్గొట్టాడు ఓ భర్త. ఈ ఘటన మెల్‌బోర్న్‌లో చోటుచేసుకుంది. ఫ్యాషన్ అని నల్లటి తాచుపాములా వున్న లెగ్గిన్స్ కొనుక్కున్న పాపానికి ఆమె కాళ్లు విరగ్గొట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా, మెల్‌బోర్న్‌కు చెందిన మహిళ అచ్చం కాళ్లు రెండు తాచుపాముళ్లా కనిపించే లెగ్గిన్స్ కొనుగోలు చేసింది. అయితే ఈ తాచుపాము లెగ్గిన్స్ వేసుకుని భర్తను ఆటపట్టిదామనుకుంది. 
 
అలా ఓ రోజు రాత్రి సరదాగా తాచుపాము లెగ్గిన్స్ ధరించింది. భర్త రాకుముందే నిద్రపోయింది. అలా రాత్రి ఇంటికి చేరుకున్న భర్త.. బెడ్‌రూమ్‌లో నిద్రిస్తున్న భార్య కాళ్లను చూసి పాము అనుకుని భయంతో వణికిపోయాడు. భయంతో బేస్ బాల్ ఆడే బ్యాట్ తీసుకొని ఆమె కాళ్లపై చితక్కొట్టాడు. భర్త కొట్టిన దెబ్బలకు భార్య గట్టిగా కేకలు వేసింది. 
 
భార్య పామును చూసి భయపడే భార్య అలా అరుస్తుందని.. ఇంకాస్త గట్టిగా కొట్టాడు. అవి పాములు కాదు.. తన కాళ్లు అని భార్య అరవడంతో తేరుకున్న భార్త ఆమెను హుటాహుటీన ఆస్పత్రికి తరలించాడు. కానీ భర్త కొట్టిన దెబ్బలకు భార్య కాలు విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించిన ఫోటోలో నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలను చూసి నెటిజన్లు వరుస కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments