Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నమ్మాయిని హోం వర్క్ చేయమనీ... భార్యను - పెద్ద కుమార్తెను కార్బన్ మోనాక్సైడ్‌తో చంపేశాడు.. ఎలా?

కట్టుకున్న భార్య, కుమార్తె తన అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని భావించిన ఓ కిరాతకుడు.. కార్బన్ మోనాక్సైడ్‌తో చంపేశాడు. ఈ దారుణం హాంకాంగ్‌లో జరుగుగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (17:07 IST)
కట్టుకున్న భార్య, కుమార్తె తన అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని భావించిన ఓ కిరాతకుడు.. కార్బన్ మోనాక్సైడ్‌తో చంపేశాడు. ఈ దారుణం హాంకాంగ్‌లో జరుగుగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
చైనా విశ్వవిద్యాలయంలో ఖా కిమ్ సన్ అనే వ్యక్తి అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తూ, డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో కిమ్‌కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భార్యకు తెలియడంతో వారి మధ్య తరచూ గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో భార్య నుంచి విడాకులకు డిమాండ్ చేయగా, అతను నిరాకరించాడు. 
 
దీంతో భార్యను పెద్ద కూతురు(16)ను హత్య చేశాలని ప్లాన్‌ చేశాడు. ఇందులో భాగంగా రెండు పెద్ద బెలూన్లు కొని, అందులో కార్బన్‌ మోనాక్సైడ్‌ వాయువును నింపాడు. చిన్న కూతురిని హోం వర్క్‌ చేసుకోమని చెప్పిన కిమ్‌.. భార్యతో పాటు పెద్ద కూతురిని తన కారులో ఉంచి అన్ని డోర్లు లాక్‌ చేశాడు.
 
కారులో ముందుగానే ఉంచిన బెలూన్ల నుంచి విడుదలైన కార్బన్‌ మోనాక్సైడ్‌ను పీల్చిన వీరిద్దరూ కారులోనే మృతిచెందారు. కేసు నమోదు చేసిన హాంకాంగ్‌ పోలీసులు, అనుమానం వచ్చి డాక్టర్‌ కిమ్‌ను అదుపుతోకి తీసుకున్నారు. మూడేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కిమ్‌ ఈ హత్యలకు కారకుడని గుర్తించారు. 
 
అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు భార్య అడ్డుగా ఉందని, ఎన్నిసార్లు అడిగినా విడాకులు ఇవ్వలేదన్న కారణంగా దారుణానికి పాల్పడినట్లు అంగీకరించాడు. ఈ కేసును విచారించిన కోర్టు కిమ్‌ను దోషిగా తేల్చింది. శిక్షను త్వరలో ఖరారు చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments