నొప్పిని దిగమింగి టాస్క్‌ను పూర్తిచేసిన చిన్నారి.. వీడియో వైరల్

Webdunia
గురువారం, 16 మే 2019 (13:07 IST)
ఆ చిన్నారికి పట్టుమని ఐదేళ్ళు కూడా ఉండవు. కానీ కరాటే శిక్షణ తీసుకుంటున్నాడు. ఇందులోభాగంగా ట్రైనర్ ఓ టాస్క్ పెట్టాడు. ఆ టాస్క్‌ను పూర్తిచేసే ప్రక్రియలోభాగంగా, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఒకవైపు కళ్ల నుంచి కారుతున్న కన్నీళ్ళను తుడుచుకుంటూనే మరోవైపు.. ట్రైనర్ ఇచ్చిన టాస్క్‌ను విజయవంతంగా పూర్తిచేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో తన ట్రయినర్ ఎరిక్ గియానీ సూచనల మేరకు ఈ చిన్నారి టైల్స్‌ను తన కాలితో పగులగొట్టాలి. పలుమార్లు విఫలమైన చిన్నారి నిరాశతో ఏడుస్తూనే వాటిని పగులగొట్టేందుకు ప్రయత్నించి, చివరికి విజయం సాధించాడు. దీంతో అతనిపై స్నేహితులంతా ప్రశంసల వర్షం కురిపించారు. 
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా, ఆ వీడియోను 2.82 లక్షల మందికి పైగా లైక్ చేయగా, 4,50,734 మంది షేర్ చేశారు. కోటిన్నర మంది వీక్షించారు. 35 వేల మంది కామెంట్స్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. టాస్క్ పూర్తిచేసే క్రమంలో కష్టాలు ఎన్ని ఎదురైనా వెనకడుగు వేయని ఆ చిన్నారిలోని దృఢత్వానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

Rashmika : దీపావళికి మంచి అప్ డేట్ ఇస్తానంటున్న రశ్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments