Webdunia - Bharat's app for daily news and videos

Install App

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

ఠాగూర్
మంగళవారం, 20 మే 2025 (22:46 IST)
భారత్‌పై ప్రతీకార జ్వాలతో నిత్యం రగిలిపోతూ పహల్గాం ఉగ్రదాడికి కుట్రపన్నిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్‌కు ఆ దేశ ప్రభుత్వం బహుమతి ఇచ్చింది. ఆయనకు అత్యున్నత స్థాయితో కూడిన పదోన్నతి కల్పించింది. ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దేశంలోనే అత్యున్నత సైనిక హోదా గుర్తింపు పొందారు. ఈ మేరకు పాక్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని ఆమోదం తెలిపింది. 
 
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహ్‌బాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో జనవర్ ఆసిం మునీర్‌ను ఫీల్డ్ మార్షల్‌గా నియమించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ పదోన్నతి ద్వారా ఆసిఫ్ మునీర్ పాకిస్థాన్ సైనిక చరిత్రలో అత్యున్నత హోదా అలంకరించిన కొద్దిమంది అధికారుల జాబితాలో స్థానం సంపాదించారు. 
 
ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో పాకిస్థాన్ తన సైన్యాధిపతికి ఇలాంటి ఉన్నతస్థాయి పదోన్నతి కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, అంతర్గత భద్రతా సవాళ్ల నేపథ్యంలో సైన్యం పాత్ర కీలకంగా మారిన సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments