Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాన్‌హాట్టన్‌ దాడికి పాల్పడిన ఉగ్రవాదిని ఎలా కాల్చారంటే.. (వీడియో)

న్యూయార్క్‌లో ట్రక్కుతో దాడికి పాల్పడిన వ్యక్తిని సైఫుల్లో సైపోవ్‌గా గుర్తించారు. స్వస్థలం ఉజ్బకిస్తాన్. 2010లో అమెరికా వచ్చిన సైపోన్.. వచ్చిన కొత్తలో అతను ట్రక్కు డ్రైవర్‌గా చేశాడు. ఆ తర్వాత అతనికి గ

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (15:22 IST)
న్యూయార్క్‌లో ట్రక్కుతో దాడికి పాల్పడిన వ్యక్తిని సైఫుల్లో సైపోవ్‌గా గుర్తించారు. స్వస్థలం ఉజ్బకిస్తాన్. 2010లో అమెరికా వచ్చిన సైపోన్.. వచ్చిన కొత్తలో అతను ట్రక్కు డ్రైవర్‌గా చేశాడు. ఆ తర్వాత అతనికి గ్రీన్ కార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం అతను ఉబర్ సంస్థలో డ్రైవర్‌గా చేస్తున్నాడు. ఇపుడు మ్యాన్‌హాట్టన్‌లో ట్రక్కుతో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 
 
ఇతనికి ఇస్లామిక్ స్టేట్‌ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. దీన్ని రుజువు చేసేలా ఐసిస్‌తో సంబంధం ఉన్న లేఖను సైపోవ్ ట్రక్కులో పోలీసులు గుర్తించారు. ఆ లేఖపై ఐసిస్ జెండా గుర్తు కూడా ఉంది. అరబిక్ భాషలో రాసిన ఆ నోటును ట్రక్కు నుంచి సీజ్ చేశారు.
 
అయితే అతనికి పూర్తిగా బ్యాక్‌గ్రౌండ్ చెక్ నిర్వహించామని ఉబర్ పేర్కొన్నది. ఈ కేసులో ఎఫ్‌బీఐకి సహకరిస్తున్నామని ఆ సంస్థ తెలిపింది. సైపోవ్‌తో సంబంధం ఉన్న ఇతర వ్యక్తి గురించి కూడా ఆరా తీస్తున్నట్లు ఉబర్ సంస్థ వెల్లడించింది. 
 
మరోవైపు.. ట్రక్కుతో బీభత్సం సృష్టించి పారిపోయేందుకు ప్రయత్నించి సైపోవ్‌ను కాల్చి చంపారు. ఈ దాడికి పాల్పడిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించాడు. ట్రక్కు నుంచి దిగి పరుగెడుతున్న అతను ఓ వీడియోకు చిక్కాడు. చేతిలో పిస్తోళ్లతో అతను రోడ్లపై పరుగులు తీశాడు. 
 
అల్లాహో అక్బర్ అంటూ అరుస్తూ పరుగెత్తాడు. ఇదేసమయంలో అక్కడకు చేరుకున్న పోలీసులు అతన్ని కడుపులో షూట్ చేశారు. రోడ్డు మీదే పడిపోయిన ఉగ్రవాది సైపోవ్‌ను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతను హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments