Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డ్యూటీకెళ్లిన ఆర్టీఓ అధికారిణి బౌన్సర్లతో కలిసి ఏం చేసిందో తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలో పని చేసే ఓ ఆర్టీఓ అధికారిణి బౌన్సర్లతో కలిసి చేయకూడని పని చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆమెపై ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తూ.. విచారణకు ఆదేశించారు. ఇంతకు ఆ అధికారిణి ఏం చే

Advertiesment
RTO officer swathi goud
, సోమవారం, 22 మే 2017 (14:16 IST)
తెలంగాణ రాష్ట్రంలో పని చేసే ఓ ఆర్టీఓ అధికారిణి బౌన్సర్లతో కలిసి చేయకూడని పని చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆమెపై ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తూ.. విచారణకు ఆదేశించారు. ఇంతకు ఆ అధికారిణి ఏం చేసిందో చూడండి.. 
 
హైదరాబాద్ నగరంలోని తిరుమలగిరి ఆర్టీవో అధికారిణిగా స్వాతిగౌడ్ పని చేస్తోంది. ఈమె ఆదివారం రాత్రి సాగర్ రింగురోడ్డులో వాహనాల తనిఖీకి వెళ్లింది. ఓ లారీని ఆపి రూ.10 వేల ఫైన్ చెల్లించాల్సిందిగా డ్రైవర్‌ను బెదిరించింది. దీనికి అతను నిరాకరించాడు. దీంతో అక్కడేవున్న బౌన్సర్లతో చితక్కొట్టించింది. ఇది వెలుగులోకి రావడంతో ఆమెపై అధికారులు సీరియస్ అయ్యారు. సాగర్ రింగురోడ్డులో ఆమె ఎందుకు తనిఖీలు చేయాల్సి వచ్చిందంటూ ఆరాతీస్తున్నారు. 
 
అసలు ఆర్టీవో అధికారిణికి బౌన్సర్లు ఎందుకున్నారనే విషయంపైనా ఉన్నతాధికారులు దృష్టిసారించారు. ఆ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన పరిధిని దాటి స్వాతిగౌడ్ వ్యవహరించిందని అక్రమ వసూళ్లకు పాల్పడిందని కొంత నిర్దారణ వచ్చింది. దాడికి పాల్పడిన వారిలో ఒకరు ఆమె సోదరుడు కాగా మరొకరు బయట వ్యక్తని అధికారులు గుర్తించారు. డ్రైవర్‌‌పై దాడి వ్యవహారమంతా సీసీ కెమెరాల్లో రికార్డవ్వడంతో ఆఫీసర్ అడ్డంగా బుక్కయ్యారు.
 
అధిక మొత్తంలో ఫైన్ వేయడంతో ఇదేంటని ప్రశ్నించినందుకు ఆమె బౌన్సర్లతో దాడి చేయించిందని లారీ డ్రైవర్‌‌ శ్రీకాంత్‌‌ ఆరోపిస్తున్నాడు. గతంలో తనవద్ద నుంచి నాలుగైదు సార్లు ఐదువేల రూపాయిల చొప్పున వసూలు చేశారని.. ఈసారి పదివేల రూపాయిలు అడిగితే ఇవ్వనందుకే ఈ దాడి చేసిందని తెలిపారు. స్వాతిగౌడ్‌‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు, ఆయన కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికపై సీ లయన్ దాడి... ఏం చేసిందో చూడండి (Video)