Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందమైన అమ్మాయిలతో మసాజ్.. ఆశపడి వెళితే... అలా జరిగింది...

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (07:10 IST)
అందమైన అమ్మాయిలతో మసాజ్ అంటూ నెట్టింట ఓ యాడ్ కనిపించింది. అందమైన అమ్మాయిలతో మసాజ్ కావాలంటే అని పేర్కొని దానికింద ఓ నంబరు ఇచ్చారు. దాన్ని చూసిన ఓ వ్యక్తి ఆ యాడ్‌ను క్లిక్ చేశాడు. అందులో మసాజ్‌కు చార్జి కేవలం రూ.3950 అని ఉండటంతో అమ్మాయిలతో మసాజ్ చేయించుకునేందుకు ఆశపడ్డాడు. ఆ కాంటాక్ట్ నంబరును సంప్రదించగా, ఓ ప్రదేశానికి రావాలంటూ తీయ్యటి గొంతుతో ఓ అమ్మాయి చెప్పింది. ఆ తర్వాత వారు చెప్పిన ప్రదేశానికి వెళ్ళిన ఆ వ్యక్తిని చేదు అనుభవం ఎదురైంది. నలుగురు మహిళలు ఆ వ్యక్తిని బంధించి, మెడపై కత్తిపెట్టి అతనివద్ద ఉన్న క్రెడిట్ కార్డులు, బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును దోచుకున్నారు. అప్పటికీ వదిలిపెట్టని వారు.. ఓ రోజంతా బంధించారు. మరుసటి రోజు వదిలిపెడుతూ.. అతని వద్ద ఉన్న ఐఫోన్‌ను బలవంతంగా తీసుకుని వదిలిపెట్టాడు. దీనిపై వ్యక్తి చేసిన ఫిర్యాదుతో ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. 
 
ఈ ఘటన దుబాయ్‌లో జరిగింది. బాధితుడు భారతీయ వ్యక్తి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ యాప్‌లో అందమైన అమ్మాయిలను చూపిస్తూ మసాజ్‌ కావాలంటే.. అంటూ ఓ నంబరును ఇచ్చారు. మసాజ్‌కు కేవలం రూ.3,950 మాత్రమే అని ఉండటంతో భారత్‌కు చెందిన ఓ వ్యక్తి దాన్ని క్లిక్‌ చేసి వివరాలు తెలుసుకున్నాడు.
 
2020 నంవంబర్‌లో మసాజ్‌ కోసం ఆ వ్యక్తిని అల్‌ రెఫా అనే ప్రాంతంలోకి రావాల్సిందిగా కోరడంతో అక్కడికెళ్లాడు. అనంతరం అక్కడి అపార్ట్‌మెంట్‌లో నైజీరియాకు చెందిన నలుగురు మహిళలు అతన్ని బంధించారు. మెడపై కత్తి పెట్టి బెదిరిస్తూ బ్యాంకు వివరాలను చెప్పాలంటూ బలవంతం చేశారు. 
 
ఆయా వివరాలను వెల్లడించడంతో క్రెడిట్‌ కార్డు, బ్యాంకు ఖాతాల ద్వారా రూ. 55,30,806ను దోచుకున్నారు. ఓ రోజు బంధించి ఉంచిన అనంతరం ఐఫోన్‌ను కూడా తీసుకొని వదిలిపెట్టారు. అనంతరం పోలీసులు, బ్యాంకును సంప్రదించి విషయం తెలిపినట్లు బాధితుడు కోర్టుకు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురు నైజీరియా మహిళలను అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments