Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాహుల్ గాంధీ భుజంపై చెయ్యేసిన అమ్మాయి.. ఎవరు..?(video)

Advertiesment
young student
, గురువారం, 18 ఫిబ్రవరి 2021 (19:04 IST)
కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీతో ఆటోగ్రాఫ్‌ అందుకున్న ఓ విద్యార్థి ఆనందానికి అదుపు లేకుండా పోయింది. రాహుల్‌ ఆటోగ్రాఫ్‌ ఇవ్వగానే నవ్వుతూ ఎగిరి గంతులేస్తూ ఆయనకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చింది. ఇంతలో ఫొటోకు ఫోజివ్వమని రాహుల్‌ అనగానే.. రాహుల్‌ భుజంపై చేయేసి మురిసిపోయింది. ఈ ఘటనకు పుదుచ్చేరిలోని భారతీదాసన్‌ ప్రభుత్వ మహిళా కళాశాల వేదికైంది.
 
 
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ రాహుల్‌ గాంధీ పుదుచ్చేరి వచ్చారు. స్థానిక భారతిదాసన్ ప్రభుత్వ మహిళల కళాశాలలో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు. పలు అంశాలపై తన అభిప్రాయాలను, మంచీచెడులను విద్యార్థులతో పంచుకున్నారు. ఇంతలో ఓ విద్యార్థి ఆటోగ్రాఫ్‌ ఇవ్వాల్సిందిగా రాహుల్‌ను కోరింది. దానికి రాహుల్‌ ఓకే అని ఆమె చేతిలో నుంచి బుక్‌ తీసుకుని ఆటోగ్రాఫ్‌ ఇస్తుండగా.. పట్టలేని ఆనందంతో డ్యాన్స్‌ చేసింది
 
ఎవరేమనుకుంటే నాకేంటి అనుకునే రీతిలో రాహుల్‌కు షేక్‌హ్యాండిచ్చింది. ఫొటోకు ఫోజు ఇవ్వమని అడగ్గానే ఏకంగా ఆయన భుజంపైనే చేయివేసింది. ఇది జరుగుతున్నంత సేపు ఆమె ముఖంపై చిరునవ్వు చెదరలేదు. అమ్మాయి అమాయకత్వాన్ని, ఆనందాన్ని చాలా మంది తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ఒకటి ట్విట్టర్‌లో పోస్ట్ కావడంతో వైరల్‌ అయింది. చాలా మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు ఈ వీడియోను మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ఖాతాల్లో షేర్‌ చేసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షార్ట్ వీడియోల మార్కెట్‌‌లోకి యూట్యూబ్.. మార్చి నెలలో లాంచ్ అవుతుందా?