Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రాన్స్‌లో ఎదురెదురుగా ఢీకొన్న విమానాలు.... ఐదుగురు దుర్మణం

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2020 (12:05 IST)
ఫ్రాన్స్‌లో రెండు విమానాలు నింగిలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. పర్యాటకులను తీసుకెళుతున్న విమానం ఒకటి మైక్రోలైట్ విమానాన్ని ఢీకొంది. ఈ ఘటన పశ్చిమ ఫ్రాన్స్‌లో భారత కాలమానం ప్రకారం, శనివారం రాత్రి 8 గంటల సమయంలో జరిగింది. 
 
ఇద్దరితో వెళుతున్న చిన్న విమానం ఒకటి, ముగ్గురు టూరిస్టులను తీసుకెళుతున్న డీఏ 40 విమానాన్ని ఢీకొంది. దీంతో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో రెండు విమానాల్లో ఉన్న అందరూ మరణించారని అధికారులు స్థానిక అధికారులు ప్రకటించారు. 
 
ప్రమాదం తర్వాత మైక్రోలైట్ విమానం, ఓ ఇంటి ఫెన్సింగ్‌పై పడగా, డీఏ 40 విమానం, దానికి కొన్ని వందల మీటర్ల దూరంలోని నిర్మానుష్య ప్రాంతంలో కుప్పకూలింది. విషయం తెలిసిన వెంటనే 50 మంది ఫైర్ పైటర్లు ఘటనా స్థలికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.
 
ప్రమాదం గురించి లియాన్ ఎమర్జెన్సీ విభాగానికి తొలుత తెలిసిందని, వారు వెంటనే విమానాన్ని ట్రాక్ చేస్తూ వచ్చి, ప్రమాదస్థలిని గుర్తించారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించి, విమానాల్లోని బ్లాక్ బాక్స్‌ల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments