Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌లో భారత్ నకిలీ కరెన్సీ... హైదరాబాద్‌లో వ్యక్తి అరెస్ట్!

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (13:52 IST)
నిన్న మొన్నటి దాకా ఉగ్రదాడుల పేరిట.. భారతదేశాన్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నించిన పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ... ఈ సారి నకిలీ కరెన్సీని ముద్రిస్తూ, దాన్ని బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి పంపడం మొదలుపెట్టింది. ఈ కరెన్సీ కూడా భారత్‌లో చలామణిలో ఉన్న అసలైన కరెన్సీ మాదిరిగానే ఉంటోంది. 
 
కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ లేకున్నా, చూడగానే, అసలైన కరెన్సీ మాదిరిగానే కనిపిస్తూండడంతో ఇవి భారత్‌లో చాలా సులువుగానే చలామణిలో అయిపోతున్నాయి. దీనిని పసిగట్టిన ఇంటెలిజెన్స్ శాఖ వారి సమాచారంతో బండ్లగూడకు చెందిన మహ్మద్‌ గౌస్‌ అనే పండ్ల వ్యాపారిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
పాక్‌లోని కెట్వాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రిస్తున్న ఈ నకిలీ కరెన్సీని తొలుత బంగ్లాదేశ్‌కు తరలించి, ఆపై, కోల్‌కత్తా మీదుగా ఇండియాలోకి పంపుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా కేంద్రంగా ఈ దందా సాగుతోందని పోలీసులు గుర్తించారు. 
 
ఆ రాష్ట్రంలో బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతంలో ఉన్న కృష్ణాపూర్‌‌కు చెందిన అమీనుల్‌ రెహ్మాన్‌ అలియాస్‌ బబ్లూతో పరిచయం పెంచుకున్న గౌస్, లక్ష నకిలీ కరెన్సీకి రూ. 40 వేలు ఇస్తూ, డబ్బు తెప్పించి చలామణి చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు బబ్లూను మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాకి చేర్చి అతని కోసం గాలింపు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments