Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్‌ 30 వరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం పొడిగింపు

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (20:40 IST)
అంతర్జాతీయ విమాన రాకపోకలపై జూన్‌ 30 వరకు నిషేధం విధిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిసిజిఎ) శుక్రవారం సర్య్కూలర్‌ జారీ చేసింది. ఈ విమానాలపై పాక్షిక నిషేధాన్ని పొడిగిస్తూ జూన్‌ 26,2020 న జారీ చేసిన మునుపటి ఉత్తర్వును సవరించింది.

అయితే షెడ్యూల్‌ చేసిన అంతర్జాతీయ విమానాలను ఎంపిక చేసిన మార్గాల్లో కేస్‌-టు-కేస్‌ ప్రాతిపదికన అనుమతించవచ్చునని డిసిజిఎ తెలిపింది. కోవిడ్‌ తొలి వేవ్‌ మొదలైన నాటి నుండి అంటే మార్చి 23,2020 నుండి భారత్‌ అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు విధించగా.. అదే ఏడాది మే నుండి వందే భారత్‌ మిషన్‌ కింద ప్రత్యేక అంతర్జాతీయ విమానాలను నడిపింంది.

జులై నుండి ఎంపిక చేసిన దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం 'ఎయిర్‌ బబుల్‌' కింద నడుస్తున్నాయి. అమెరికా, బ్రిటన్‌, యుఎఇ, కెన్యా, భూటాన్‌, ఫ్రాన్స్‌తో పాటు 27 దేశాలతో ఈ ఒప్పందం చేసుకుంది. ఎయిర్‌బబుల్‌ ఒప్పందం ప్రకారం ఆయా దేశాలు...ప్రత్యేక విమానాలను వారి భూభాగాల మధ్య నడుపుతుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments