Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవర్‌ గివెన్‌ నౌకకు రూ.7500 కోట్లు చెల్లించాల్సిందే : ఈజిప్టు

Webdunia
బుధవారం, 14 ఏప్రియల్ 2021 (08:57 IST)
సూయజ్‌ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయి నౌకా వాణిజ్యానికి భారీ నష్టాన్ని కలిగించిన కంటెయినర్‌ రవాణా నౌక ‘ఎవర్‌ గివెన్‌’కు ఈజిప్ట్‌ న్యాయస్థానం 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7500 కోట్లు) భారీ జరిమానా విధించింది. దీనిని చెల్లించేందుకు యాజమాన్యం ఇష్టపడకపోవడంతో నౌకను ప్రభుత్వం జప్తు చేసుకుంది. 
 
గత నెల 23న ఈ నౌక.. కాలువలో ఇరుక్కుపోయి ఆరు రోజుల తర్వాత కదిలిన విషయం తెలిసిందే. దీనివల్ల ఇతర నౌకలు రెండువైపులా నిలిచిపోయాయి. ఎవర్‌ గివెన్‌ను కదిలించడానికి భారీగా అయిన ఖర్చు, కాలువలో రాకపోకలు సాగకపోవడం వల్ల నిలిచిపోయిన ఆదాయం వంటివి లెక్కించి జరిమానా విధించారు. ఇది చెల్లించేవరకు ఆ నౌక తమ జలాల నుంచి కదిలేందుకు వీల్లేదని ఈజిప్ట్‌ తేల్చిచెప్పింది.
 
ఎవరి గివెన్ షిబ్ కంటెయినర్ అడ్డంగా చిక్కుకుని పోవడం వల్ల ఆ నౌక యజమానులు అష్టకష్టాలు ఎదుర్కొన్న విషయం తెల్సిందే. కాల్వ నుంచి ముందుకు కదిలేందుకు మోక్షం లభించినప్పటికీ ఆ కంటెయినర్‌ను ఈజిప్ట్‌ సీజ్‌ చేసింది. వారానికి పైగా సూయజ్‌లోనే ఎవర్‌ గివెన్‌ కదలకుండా మొరాయించడంతో ఆ కాల్వ గుండా సరుకు రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. 

సంబంధిత వార్తలు

మాస్ ప్రేక్షకులను మెప్పించే చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" : ప్రముఖ నటి అంజలి

రేవ్ పార్టీలో లేకపోవడం మీడియాకు కంటెంట్ లేదు.. రేయి పగలు జరిగే ప్రశ్న : నటుడు నవదీప్

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఈసీ సీరియస్

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ తీశాడు : దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఎండాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి... ఈ జాగ్రత్తలు పాటిస్తే..?

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

తర్వాతి కథనం
Show comments