Webdunia - Bharat's app for daily news and videos

Install App

గినియాలో ఎబోలా వైరస్‌

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (09:17 IST)
ఇప్పటికే కరోనా తో అల్లాడిపోతున్న గినియాను ఎబోలా కూడా చుట్టుముట్టేసింది. ఎబోలా వైరస్‌తో ముగ్గురు మరణించిన తర్వాత తమ దేశంలో ఈ వైరస్‌ వుందని గినియా ప్రకటించింది. మరో నలుగురు ఈ వైరస్‌తో అస్వస్థులయ్యారు.

లైబేరియా సరిహద్దుల్లో గోయకేలో ఒక అంత్యక్రియలకు హాజరైన ఈ ఏడుగురు డయేరియా, వాంతులు, రక్తస్రావంతో బాధపడ్డారు. బాధితులందరినీ చికిత్సా కేంద్రాల్లో విడిగా వుంచి వైద్యం చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఎబోలా వైరస్‌ వున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2013-16 మధ్య కాలంలో గినియాలో ప్రారంభమైన ఈ వైరస్‌తో పశ్చిమాఫ్రికాలో 11,300 మంది మరణించారు.

ప్రధానంగా గినియా, లైబేరియా, సియర్రా లియోన్‌లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఎబోలా వైరస్‌ నిర్ధారణ కోసం రెండో రౌండ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసుల మూలాలను కనుగొనేందుకు ఆరోగ్య సిబ్బంది కృషి చేస్తున్నారు. ఎబోలా వ్యాక్సిన్ల కోసం గినియా ఇప్పటికే డబ్ల్యుహెచ్‌ఓను సంప్రదించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments