ఆ చేప సముద్ర గర్భం నుంచి బయటకి వచ్చి చచ్చిపోయింది, ఈ వార్తను చూసి స్పెయిన్ లోని ప్రజలు వణికిపోతున్నారట. దీనికి కారణం లేకపోలేదు. గతంలో ఇలాంటి చేపలు కొన్ని సముద్ర గర్భం నుంచి సముద్ర తీరానికి కొట్టుకుని వచ్చి కుప్పలుగా చనిపోయాయట. అలా జరిగిన కొన్నిరోజులకు భారీ భూకంపాలు, ప్రకృతి విపత్తలు సంభవించాయని చెబుతున్నారు.
ఓర్ ఫిష్ యొక్క ప్రత్యేక జాతికి చెందిన ఈ చేప పేరు డూమ్స్‌డే చేప. బెల్టు మాదిరిగా తళతళలాడుతూ స్పెయిన్ దేశంలోని కానరీ దీవులలో వున్న లాస్ పాల్మాస్ బీచ్ తీరంలో ఈ చేప కనబడింది. సముద్ర తీరానికి వచ్చిన ఆ చేప ఒడ్డుకు వచ్చి చనిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.