ఇరాక్‌లో వెలుగు చూసిన 3400 యేళ్ల నాటి పురాతన నగరం

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (16:35 IST)
ఇరాక్ దేశంలో 3400 యేళ్ల నాటి పురాతన నగరం ఒకటి వెలుగుచూసింది. ఈ దేశంలోని కుర్దిస్థాన్‌లో కరవు కారణంగా ఇక్కడి భారీ జలాశయం ఒకటి ఎండిపోయింది. ఈ క్రమంలో దాదాపు 3,400 ఏళ్లనాటి పురాతన నగరం తాజాగా బయటపడింది. 
 
టైగ్రిస్‌ నది ఎండిపోయిన భాగంలో కనిపించిన ఈ స్థావరాన్ని.. కాంస్య యుగానికి చెందినదిగా భావిస్తున్నారు. నదిలో నీళ్లు లేకపోవడంతో.. ఇక్కడ తవ్వకాలకు వీలు కుదిరింది. క్రీ.పూ 1550 - క్రీ.పూ 1350 మధ్య మిట్టని సామ్రాజ్య పాలనలో ఈ నగరం.. కీలక కేంద్రంగా విలసిల్లి ఉండొచ్చని కుర్దిష్‌, జర్మనీ ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం అభిప్రాయపడింది.
 
జర్మనీ పురావస్తు బృందంలోని డా.ఇవాన పుల్జిజ్‌ ఓ ప్రకటనలో స్పందిస్తూ, 'ఈ నగరం నేరుగా టైగ్రిస్‌లో బయటపడింది. అంటే.. అప్పట్లో ఇది మిట్టని సామ్రాజ్యంలోని ప్రధాన ప్రాంతాన్ని(ప్రస్తుతం ఈశాన్య సిరియాలో ఉంది).. దాని తూర్పు ప్రాంతంతో అనుసంధానించడంలో ముఖ్యమైన పాత్ర పోషించి ఉండవచ్చు' అని పేర్కొన్నారు. 
 
అయితే, ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌లో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. దీంతో పురాతన నగరం మరింత దెబ్బతినకుండా ఉండేందుకుగానూ దాన్ని పూర్తిగా ప్లాస్టిక్‌ షీట్‌లతో కప్పారు. మట్టి గోడలను, శిథిలాల్లో దాగి ఉన్న ఇతర వస్తువులను సంరక్షించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: యుద్దం నేపథ్యంలో శంబాల ట్రైలర్‌.. ఆవిష్కరించిన ప్రభాస్

Allari Naresh: ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ

Bhagyashree Borse: నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ.. రామ్, భాగ్యశ్రీ బోర్సే

Mass Jatara Review: జరుగుతున్న కథతో ఫ్యాన్స్ ఫార్ములాగా మాస్ జాతర - మూవీ రివ్యూ

Allu Sirish and Nayanika: నయనిక రెడ్డితో అల్లు శిరీష్.. తారల సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments