ఉక్రెయిన్‌లో ఆగని రష్యా కాల్పులు... సామాన్య ప్రజలపై బాంబుల వర్షం

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (08:53 IST)
ఉక్రెయిన్‌ను ఆక్రమించేందుకు రష్యా కాల్పులు ఆగట్లేదు. రష్యన్ ఆర్మీ ప్రస్తుతం అపార్ట్‌మెంట్లు, ఇళ్లపై బాంబుల వర్షం కురిపిస్తోంది. బంకర్లపై మిసైళ్లు ప్రయోగిస్తోంది. దీంతో వేలాది మంది ప్రజలు.. అభం శుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. 
 
మరోవైపు.. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను తిరస్కరిస్తున్నామని రష్యా స్పష్టం చేసింది. యుద్ధం ప్రారంభమై 22 రోజులైనా కూడా యుక్రెయిన్‌పై భీకర దాడికి పాల్పడుతోంది రష్యా. సామాన్య ప్రజలే టార్గెట్‌గా బాంబులు, మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. నడి వీధుల్లో ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.
 
కేవలం సైనికులు, సైనిక స్థావరాలే అంటూ దండయాత్ర మొదలుపెట్టిన రష్యా.. ఇప్పుడు సామాన్యులే టార్గెట్‌గా విరుచుకుపడుతోంది. 
 
ఉక్రెయిన్‌ ఉత్తర ప్రాంతంలోని చెర్నిహివ్‌ పట్టణంలో బ్రెడ్‌ కోసం క్యూలో నిలబడి ఉన్న 13 మందిని రష్యా సైనికులు కాల్చి చంపారంటే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.  
 
రష్యా దాడులకు నిత్యం వేల మంది అయిన వారికి దూరమవుతున్నారు. నగరాలను శిథిలం చేయడమే కాదు.. పెద్దఎత్తున ప్రజల ప్రాణాలను బలిగొంటోంది రష్యా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

Rajamouli: రాజమౌళి సినిమానుంచి తీసేసిన ఆ వ్యక్తే ది రాజా సాబ్ విఎఫ్.ఎక్స్ లేట్ చేస్తున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments