ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా వంట నూనెల ధరలు ఊహించని స్థాయిలో మండిపోతున్నాయి. ఆ యుద్ధం ప్రభావంతో పలు రకాల ఉత్పత్తులతోపాటు వంట నూనెలపైనా పడింది.
ఈ ధరల నియంత్రణకు ఏపీలో మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద రైతు బజార్లో కొన్ని కౌంటర్లు పెట్టనున్నారు. మొబైల్ వాహనాల్లో కూడా ఆయిల్ విక్రయించనున్నారు. స్వయం సహాయక బృందాల ద్వారా పంపిణీ చేయనున్నారు. దీంతో అధికధరల విక్రయానికి చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
హోల్ సేల్ డీలర్లు, మిల్లర్లు, రిఫైనరీదారులు కేంద్ర ప్రభుత్వ వెబ్ పోర్టల్‌కు లోబడి స్టాక్ పరిమితిని పాటిస్తున్నారో లేదో తనిఖీలు చేయనున్నారు అధికారులు. దీంతో పాటు రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతి రోజు సమావేశమై వంట నూనెల ధరలను సమీక్షించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.