Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం విధించే అవకాశం ఉందా? ట్రంప్ ఏమన్నారు?

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (10:29 IST)
చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మొదట 59 యాప్స్‌పై.. ఆ తర్వాత మరికొన్నింటిపై నిషేధం విధించింది భారత్. ఈ నేపథ్యంలో భారత్ దారిలోనే అగ్రరాజ్యం అమెరికా సహా.. పలు దేశాలు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ముఖ్యంగా టిక్‌టాక్‌పై చర్చ సాగుతోంది.
 
ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టీమ్‌లో కీలకంగా ఉన్న అధికారులు టిక్‌టాక్ గురించి ప్రస్తావించగా.. ఈ సారి ఏకంగా.. అధ్యక్షుడు ట్రంప్ నోటి వెంట కూడా టిక్ టాక్ మాట వినిపించింది. టిక్‌టాక్‌పై తమ ప్రభుత్వం నిషేధం విధించే అవకాశం ఉందని.. టిక్‌టాక్ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని.. టిక్‌టాక్‌పై మా ప్రభుత్వం నిషేధం విధించవచ్చు అని.. నిషేధానికి బదులు రెండు ఆలోచనలు కూడా మా ముందు ఉందంటూ పేర్కొన్నారు ట్రంప్. 
 
టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం విధించే అవకాశం ఉందా? అంటూ మీడియా ప్రశ్నించగా.. టిక్‌టాక్‌ అంశాన్ని పరిశీలిస్తున్నాం. దీనిపై ఓ నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తున్నాం అని పేర్కొన్నారు డొనాల్డ్ ట్రంప్.
 
మరోవైపు.. టిక్‌టాక్‌ను తమ చైనా మాతృ సంస్థ నుంచి జాతీయ భద్రతా ప్రాతిపదికన విడదీయాలని ట్రంప్ ఆదేశిస్తున్నట్లు మీడియా నివేదికలు శుక్రవారం తెలిపాయి. మరోవైపు టిక్‌టాక్‌ను కొనుగోలు చేయడానికి మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతున్నాయని, వీటిని పదిలక్షల డాలర్ల విలువైనదిగా పరిగణించవచ్చునని మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments