Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాలంలో ఆన్‌లైన్ క్లాసులు.. స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదని..

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (10:14 IST)
కరోనా కాలంలో పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి.  ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్ క్లాసులు కొందరి విద్యార్థుల జీవితాల్లో తంటాలు తెచ్చిపెడుతున్నాయి. విద్యార్థుల ప్రాణాలను బలిగొంటున్నాయి.

నిరుపేద విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు లేకపోవడంతో.. ఆన్‌లైన్ క్లాసులను వినడం ఇబ్బందిగా మారింది. దీంతో స్మార్ట్‌ఫోన్లు లేక, క్లాసులు వినలేక సతమతమై క్షణికావేశంలో ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కుడలూరు జిల్లాకు చెందిన ఓ 14 ఏళ్ల విద్యార్థి పదోతరగతి చదువుతున్నాడు. కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో తమిళనాడు స్కూళ్లన్నీ ఆన్‌లైన్ క్లాసులను ప్రారంభించాయి. అయితే ఈ విద్యార్థికి స్మార్ట్‌ఫోన్ లేకపోవడంతో క్లాసులను వినడం లేదు. తనకు ఫోన్ కొనివ్వమని తండ్రిని అడిగాడు. జీడిపప్పు పండించే ఆ విద్యార్థి తండ్రి.. అది అమ్ముడుపోగానే ఫోన్ కొనిస్తానని చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై క్షణికావేశంలో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments