వ్యాయామాల్లో పరుగు కూడా ఒకటి. కొందరు నడక మాత్రమే చేస్తుంటారు. మరికొందరు పరుగు కూడా చేస్తుంటారు. జస్ట్ కొద్ది నిమిషాల పరుగుతో ఎన్నో రకాల రోగాల్ని దూరం చేసుకోవచ్చు. అయితే పరుగు వ్యాయామం చేసేవారు ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
పరుగు తీసేవారు రోజూ ఒక కమలా తినాలి. కమలాలో ఉండే 'సి' విటమిన్ కండరాల అరుగుదలను నివారిస్తుంది. దీనిలో ఇనుము నిల్వల వల్ల అలసట, నీరసం దూరమవుతాయి. అలాగే బాదంపప్పు తీసుకోవాలి. వీటిలో వుండే యాంటీ ఆక్సిడెంట్ అయిన విటమిన్ 'ఇ' కీళ్ల నొప్పుల్ని దూరం చేస్తుంది. బాదంలో ఉండే ప్రొటీన్, ఫైబర్లు పరుగు సమయంలో ఆకలి తెలియకుండా సాయపడతాయి. గుప్పెడు బాదం పప్పులను వారంలో నాలుగైదు రోజులు తీసుకుంటే చాలు.
పరుగు వ్యాయామం చేసేవారు వారంలో రెండ్రోజులు చేపల్ని ఆహారంలో తీసుకోవాలి. వీటిని తీసుకోవడం ద్వారా చేపలో వుండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. శాఖాహారులు పప్పులు, చిక్కుడు గింజలతో కూడిన ఆహారం తీసుకుంటే సరిపోతుంది.