Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్ స్టార్‌కు డబ్బులు ఇచ్చిన కేసులో దోషిగా తేలిన డోనాల్డ్ ట్రంప్!!

ఠాగూర్
శుక్రవారం, 31 మే 2024 (17:44 IST)
అమెరికా పోర్న్ స్టార్‌కు డబ్బులు ఇచ్చిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దోషిగా తేలారు. ఈ పోర్న్ స్టార్ స్మార్టీ డేనియల్స్‌తో డోనాల్డ్ ట్రంప్‌కు అక్రమంసంబంధం ఉండేది. ఇది వెలుగులోకి రాకుండా ఉండేందుకు ఆమెకు డబ్బులు ఇచ్చి నోరు మెదపకుండా చేశారు. ఈ కేసులోనే డోనాల్డ్ ట్రంప్‌ను మన్‌హట్టన్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఏకంగా 34 అంశాల్లో ఆయనను దోషిగా నిర్ధారించింది. మాజీ అటార్నీ మైఖేల్ కోహెన్ ద్వారా ట్రంప్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు డబ్బులు చెల్లించినట్టు నిర్ధారణ కావడంతో ట్రంప్‌‍ను ముద్దాయిగా కోర్టు నిర్ధారించింది. 
 
అయితే, ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ట్రంప్ తన వ్యాపార ఖాతాలను తారుమారు చేశారు. ఈ కేసులో కొన్ని రోజుల నుంచి కోర్టులో విచారణ జరిగింది. చివరికి న్యాయస్థానం మాజీ అధ్యక్షుడిని దోషిగా తేల్చింది. దోషిగా తేలిన ట్రంప్‌కు జులై 11వ తేదీన మన్‌హట్టన్ కోర్టు శిక్షను ఖరారు ఇక తన తండ్రి దోషిగా తేలడంతో కుమార్తె ఇవాంక ట్రంప్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ మేరకు తన తండ్రితో ఉన్న చిన్ననాటి ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఆ ఫొటోకు 'లవ్ యూ డాడ్' అంటూ హార్ట్ ఎమోజీతో కూడిన క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్  అవుతోంది. 
 
ఇక ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇవాంక వైట్ హౌస్‌లో ఆయనకు అడ్వైజర్‌గా సేవలు అందించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గత ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడంతో ఆమె తన తండ్రి వ్యవహారాలపై ఎక్కడా మాట్లాడలేదు. సోషల్ మీడియా వేదికల్లో కూడా గత కొంతకాలంగా ఆమె చేస్తున్న పోస్టుల్లో ఎక్కువగా ఫ్యామిలీ హాలీడే వెకేషన్స్ ఫొటోలు, సెల్ఫీలు, హాలీడే సందేశాలు మాత్రమే కనిపించాయి. 
 
మరోవైపు, శుక్రవారం మన్‌హాట్టన్ కోర్టు ఇచ్చిన తీర్పును ట్రంప్ తప్పుపట్టారు. జ్యూరీ తీసుకున్న నిర్ణయం అవమానకరమని, నిజమైన తీర్పు నవంబరు 5వ తేదీన జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో తెలుస్తుందని ట్రంప్ అన్నారు. ఇక ఈ యేడాది నవంబరులో జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరపున ట్రంప్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థమన్ ఆవేదనకు కారణం ఏమిటి? థమన్ మాటలకు చిరంజీవి షాకింగ్ కామెంట్స్

సినిమాలు వదులుకుంటున్న కథానాయిక నిధి అగర్వాల్

ఓంకార్, ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్ గా డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్

పీరియడ్స్‌ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

తమ 3వ ఎడిషన్‌తో తిరిగి వచ్చిన మ్యూజిక్ ఫెస్టివల్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం