Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరేళ్ల వయసున్న బుడ్డోడితో పోటీ పడుతున్నా : జో బైడెన్

Advertiesment
joe biden

వరుణ్

, సోమవారం, 29 ఏప్రియల్ 2024 (12:00 IST)
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(85) వయసును ప్రస్తావిస్తూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ అవహేళన చేస్తుంటారు. బైడెన్ తడబాటు, వయసు, మతిమరపు వంటివి పేర్కొంటూ ఆయన కంటే తానే మెరుగైన అధ్యక్షుడవుతాయని చెబుతుంటారు. ట్రంప్ వయసు 77. అయితే, తాజాగా బైడెన్ కూడా ట్రంప్ వయసు ప్రస్తావనతో ఎద్దేవా చేశారు. తాను ఆరేళ్ల వయసున్న బుల్డోడితో పోటీ పడుతున్నాంటూ ట్రంప్ దుందుడుకు స్వభావాన్ని ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. 
 
'అవును.. ఈసారి ఎన్నికల్లో వయసు కూడా ఓ అంశం. నేను ఓ ఆరేళ్ల బుద్దోడితో పోటీపడుతున్నా' అని సెటైర్ వేశారు. శ్వేతసౌధంలో జరిగిన కరెస్పాండెంట్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న బైడెన్ ట్రంప్‌పై చురకలు వేశారు. ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపై అమెరికాలో నిరసనలు, అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఇందులో సుమారు 3 వేల మంది జర్నలిస్టులు, సెలబ్రిటీలు, రాజకీయనేతలు పాల్గొన్నారు. 
 
మరోవైపు, ఇజ్రాయెల్ విషయంలో బైడెన్ తడబడినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తన ప్రసంగం ఆసాంతం బైడెన్ ట్రంప్‌ను టార్గెట్ చేశారు. 'డోనాల్డ్ గత కొన్ని రోజులుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇది 'స్టార్మీ' వెదర్ (ప్రతికూల వాతావరణం) అనుకోవచ్చంటూ డోనాల్డ్ ట్రంప్ - స్టార్మీ డేనియల్స్ ఎఫైర్‌ను పరోక్షంగా ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంపై దాడి చేయాలన్న తన ఉద్దేశాన్ని ట్రంప్ ఎప్పుడూ దాచుకోలేదు. తొలి రోజు నుంచే తాను డిక్టేటర్లా వ్యవహరిస్తానని ట్రంప్ అన్నారు. తమ మద్దతుదారుల తరపున ప్రతీకారం, ప్రాయశ్చిత్తం చేసుకుంటానని అంటున్నారు. గతంలో అధ్యక్షులు ఎవరైనా ఇలా మాట్లాడగా విన్నామా? ట్రంపు మనం సీరియస్‌గా తీసుకోవాలి. ఎనిమిదేళ్ల క్రితం ఇలాంటి వ్యాఖ్యలను ట్రంప్ సహజశైలిగా కొట్టిపారేవాళ్లం. ఇకపై అలా ఎంత మాత్రం చేయకూడదు. 'జనవరి 6 కాంగ్రెస్ దాడి' తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది" అని బైడెన్ వ్యాఖ్యానించాడు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో భగ్గుమంటున్న ఎండలు.. ఆ రాష్ట్రాల్లో వడగాల్పులు