Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈసారి డోనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేస్తా : నిక్కీ హేలీ

Nikki Haley

ఠాగూర్

, గురువారం, 23 మే 2024 (09:14 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే, గతంలో అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్‌ పార్టీ తరపున డొనాల్డ్‌ ట్రంప్‌నకు గట్టి పోటీనిచ్చిన నిక్కీ హేలీ ఈ దఫా మనసు మార్చుకున్నారు. ఎట్టకేలకు ఆయనకు మద్దతు పలికారు. రాబోయే ఎన్నికల్లో తాను ఆయనకే ఓటేస్తానని ప్రకటించారు. 'హడ్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వాషింగ్టన్‌'లో బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
 
అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలగిన అనంతరం నిక్కీ హేలీ ట్రంప్‌నకు బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ విషయంలో ఇప్పటివరకు ఆమె మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఆమె మద్దతుదారులంతా క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడే ప్రమాదం ఉందని రిపబ్లికన్‌ వర్గాలు అనుమానిస్తూ వచ్చాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ రిపబ్లికన్‌ పార్టీ ఏకతాటిపై ఉందన్న సందేశాన్ని హేలీ పంపారు.
 
అభ్యర్థిత్వ రేసులో ఉన్న సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరి ఓట్లను ట్రంప్‌ తనవైపు తిప్పుకోవాల్సిన అవసరం ఉందని హేలీ అన్నారు. వారి మద్దతు కూడగట్టడం కోసం ఆయన శ్రమించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. గుడ్డిగా వారంతా తన వెనకాలే ఉంటారని ట్రంప్‌ అనుకోవడం పొరపాటే అవుతుందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓబీసీ సర్టిఫికేట్లను రద్దు చేసిన కోల్‌కతా హైకోర్టు