Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిమ్‌ను అమెరికాకు ఆహ్వానిస్తా.. భేటీ మధ్యలో సమస్య వస్తే లేచిపోతా: ట్రంప్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సింగపూర్‌లో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో.. డొనాల్డ్ ట్రంప్.. కిమ్ జాంగ్ ఉన్‌ను అమెరికాకు ఆహ్వానిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశ

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (12:15 IST)
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సింగపూర్‌లో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో.. డొనాల్డ్ ట్రంప్.. కిమ్ జాంగ్ ఉన్‌ను అమెరికాకు ఆహ్వానిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగపూర్‌లో జరుగనున్న సమావేశం సఫలమైతే.. ఆయనను అమెరికాకు ఆహ్వానిస్తామని తెలిపారు. వైట్‌హౌస్‌లో కిమ్ జాంగ్‌కు ఆతిథ్యమిస్తానని చెప్పారు. 
 
ఈ సమావేశంలో కిమ్‌తో ఏదైనా సమస్య వస్తే.. మధ్యలోనే లేచిపోతానని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంత అవసరం రాదనుకుంటున్నానని తెలిపారు. ఉత్తర కొరియా ప్రజల కోసం ఏదైనా గొప్ప పని చేయాలనే ఉద్దేశంతో కిమ్ వున్నారని.. తాను ఆ విషయాన్ని నమ్ముతున్నానని చెప్పారు.
 
ఇదిలా ఉంటే.. సింగపూర్ వేదికగా ఈ నెల 12న ఉదయం 9 గంటలకు డొనాల్డ్ ట్రంప్- కిమ్ జాంగ్ ఉన్ సమావేశం ఉంటుందని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి సారా శాండర్స్ వెల్లడించారు. ఈ సమావేశానికి అమెరికా నుంచి భద్రతా బలగాలు సింగపూర్ వెళతాయని, ముందురోజు రాత్రి 9 గంటల నుంచే సమావేశం ప్రాంతం తమ అధీనంలో ఉంటుందని శాండర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments