Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియాలో కూడా ఫేస్ బుక్ అంత పని చేసిందా?

ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‍బుక్‌పై రోజురోజుకీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారుల సమాచార భద్రతా ఉల్లంఘనకు సంబంధించి ఇటీవలే అమెరికా కోర్టు ఆ సంస్థకు అక్షింతలు వేసింది. దీనిపై ఆ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ స్పందిస్తూ వినియోగదారుల వి

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (12:00 IST)
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‍బుక్‌పై రోజురోజుకీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారుల సమాచార భద్రతా ఉల్లంఘనకు సంబంధించి ఇటీవలే అమెరికా కోర్టు ఆ సంస్థకు అక్షింతలు వేసింది. దీనిపై ఆ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ స్పందిస్తూ వినియోగదారుల విశ్వాసానికి విఘాతం కలిగిన మాట వాస్తవేమని అంగీకరించి, ఇకపై అటువంటి ఉల్లంఘనలకు తమ సంస్థ పాల్పడదని హామీ ఇస్తూ క్షమాపణలు కూడా కోరుతున్నాడు.
 
అయితే భారత్‌లో కూడా ఇప్పుడు ఫేస్‌బుక్‌పై ఇలాంటి ఆరోపణలే వెల్లువెత్తుతున్నాయి. ఆ సంస్థ వినియోగదారుల సమాచారాన్ని మొబైల్ ఫోన్ తయారీ సంస్థలతో పంచుకున్నట్లు కథనాలు రావడంతో, దీనిపై కేంద్రం స్పందిస్తూ ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో జూన్ 20 లోపు వివరణ ఇవ్వాలని ఫేస్‌బుక్‌ను ఆదేశించింది. వినియోగదారుల నుండి ఎలాంటి అనుమతి పొందకుండానే వారి సమాచారాన్ని మొబైల్, ఇతర పరికరాల తయారీ సంస్థలకు పంచుకున్నట్లు ఆరోపించిన కథనాలు తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో దీనిపై కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందని పేర్కొంది.
 
దీనిపై ఫేస్‌బుక్ స్పందిస్తూ, వినియోగదారుల సమాచార భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని, కేంద్ర ప్రభుత్వ సందేహాలకు సమాధానమిస్తామని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments