Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంగ్రెస్‌లు కుమ్ములాటలు... సీఎం కుమార స్వామిలో ఆందోళన

కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. మంత్రిపదవులు దక్కని నేతలంతా అలకబూనారు. దీంతో ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

కాంగ్రెస్‌లు కుమ్ములాటలు... సీఎం కుమార స్వామిలో ఆందోళన
, శుక్రవారం, 8 జూన్ 2018 (11:59 IST)
కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. మంత్రిపదవులు దక్కని నేతలంతా అలకబూనారు. దీంతో ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
 
గత నెల 24వ తేదీన ముఖ్యమంత్రిగా కుమార స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన మంత్రివర్గాన్ని విస్తరించలేక పోయారు. పదవులు పందారంలో తీవ్రజాప్యం నెలకొనడంతో రెండు వారాల తర్వాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. 
 
ఈ కేబినెట్ కొలువుదీరి ఒక రోజైనా గడవకముందే కాంగ్రెస్ నేతలు రగలిపోతున్నారు. తమకు న్యాయం చేయకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామంటూ సీనియర్లు అల్టిమేటం జారీచేశారు. కొందరు నేతల అనుచరులైతే ఏకంగా కేపీసీసీ కార్యాలయం ఎదుట, మరి కొందరు రోడ్లపైన నిరసన వ్యక్తంచేశారు.
 
సీనియర్ నేత ఎంబీ పాటిల్ నివాసంలో అసంతృప్త నేతలంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంటీబీ నాగరాజు, శివళ్లి, రోషన్‌బేగ్‌, హ్యారీస్‌, రాజు హలగూరు, డాక్టర్‌ సుధాకర్‌‌తో పాటు స్వతంత్ర ఎమ్మెల్యే నాగేశ్‌ కూడా పాల్గొన్నారు. సిద్ధరామయ్య ఆప్తులను లక్ష్యంగా చేసుకుని డిప్యూటీ సీఎం పరమేశ్వర కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. 
 
దీంతో జరుగుతున్న పరిణామాలను చూసి సీఎం కుమారస్వామి ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు, అసంతృప్తులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం తమ దూతలను రంగంలోకి దించినట్టు సమాచారం. వారు నేడోరేపో బెంగుళూరుకు చేరుకుని అసంతృప్తులకు నచ్చజెప్పనున్నట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబైలో మరో చరిత్ర... వారి ప్రేమకథ వింటే ఎవరైనా కన్నీళ్లు పెట్టాల్సిందే...