Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజాబ్ దెబ్బకు అట్టుడికిపోతున్న ఇరాన్ - 75 మంది మృతి

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (10:20 IST)
ఇరాన్ దేశాన్ని హిజాబ్ కుదిపేస్తోంది. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆ దేశ మహిళలు కదంతొక్కారు. ఈ సంఖ్య పదుల నుంచి వందలు, వందల నుంచి వేలు, వేల నుంచి లక్షల్లోకి చేరుకుంది. ఫలితంగా హిజాబ్ దెబ్బకు ఇరాన్ అట్టుడికిపోతోంది. ఈ ఆందోశలనపై ఇరాన్ సైనికులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఫలితంగా ఇప్పటివరకు 75 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. 
 
హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న కారణంతో 22 యేళ్ల యువతిని ఇరాన్ పోలీసుల నైతిక విభాగం అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆమె తీవ్ర గాయాలతో మృతి. దేశంలోని 46 నగరాలు, పట్టణాలకు వ్యాపించిన నిరసనలు వ్యాపించాయి. 
 
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో నిన్న వేలాదిమంది ఆందోళనకారులు ‘డెత్ టు ద డిక్టేటర్’ అంటూ నినాదాలు చేశారు. మూడు దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమైనీ పాలనకు చరమగీతం పలకాలని నినదించారు. 
 
అమిని మృతి తర్వాత దేశంలోని 46 నగరాలు, పట్టణాలు, గ్రామాలకు నిరసనలు పాకాయి. ఈ నెల 17న ప్రారంభమైన నిరసనల్లో ఇప్పటివరకు 41 మంది ఆందోళనకారులు, పోలీసులు చనిపోయినట్టు ఇరాన్ అధికారిక టీవీ ప్రకటించింది. అమిని మృతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో విదేశీ కుట్ర ఉందన్న వార్తలను ఇరాన్ ప్రభుత్వం ఖండించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments