Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ ఆయుధగారాన్ని ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (11:00 IST)
ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌ భయంతో వణికిపోతోంది. కానీ మన దాయాది దేశమైన పాకిస్థాన్ మాత్రం తన వక్రబుద్ధిని వీడటం లేదు. భారత్‌కు వ్యతిరేకంగా తీవ్రవాదమూకలను ఉసిగొల్పుతోంది. ఇటీవల జమ్మూ కాశ్మీరులోని కుప్వారా జిల్లాలో ఏ విధమైన కవ్వింపులూ లేకుండానే, కాల్పులు జరిపి, ఐదుగురు ప్రత్యేక దళ సైనికులను పొట్టనబెట్టుకున్న విషయం తెల్సిందే. 
 
దీనికి భారత్ ప్రతీకార చర్య తీసుకుంది. భారత సరిహద్దుల నుంచి బోఫోర్స్ గన్స్‌ను వినియోగించిన సైన్యం, పాక్‍కు చెందిన ఆయుధాగారాన్ని ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన డ్రోన్ ఫుటేజ్ వీడియోను సైన్యాధికారులు విడుదల చేశారు.
 
ఈ వీడియోలో పలుమార్లు పేలుడు చప్పుళ్లు వినిపిస్తున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి వున్న టెర్రర్ లాంచ్‌పాడ్స్, పన్‌పొజిషన్స్, ఆయుధాలను దాచివుంచిన కేంద్రాలపై దాడులు జరిపినట్టు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. అనుకున్న లక్ష్యాన్ని భారత గన్స్ ఛేదించాయని రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నారు. 
 
కాగా, గత ఆదివారం కుప్వారా జిల్లాలో స్పెషల్ ఫోర్స్ సోల్జర్స్‌పై దాడికి దిగిన ఉగ్రవాదులు, ఐదుగురిని చంపేసిన సంగతి తెలిసిందే. ఆపై జరిగిన ఎన్‌కౌంటరులో ఉగ్రవాదులందరినీ భారత సైన్యం హతమార్చింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారాన్ని తెలుసుకున్న సైన్యం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం