Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లి నుంచి కరోనా?.. అందుకే చైనా ఆ మాంసాన్ని నిషేధించిందా?

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (08:57 IST)
పిల్లి నుంచి మనిషికి కరోనా సోకుతుందా?.. ఇప్పటికే దీనిని చైనా గమనించిందా?.. అందుకే పిల్లి, కుక్క మాంస విక్రయాలను నిషేధించిందా?.. అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇటీవల బెల్జియంలో ఓ పిల్లికి దాని యజమాని నుంచి కరోనా సంక్రమించిన నేపథ్యంలో శాస్తవేత్తలు ఈ దిశగా పరిశోధనలు చేపట్టారు.

ఇందులో భాగంగా పిల్లుల్లో ఒకదాని నుంచి మరొకదానికి ఈ వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. శాస్త్రవేత్తలు ఓ మూడు పిల్లులకు కరోనా వైర్‌సను ఇంజెక్ట్‌ చేసి, వాటితో ఆరోగ్యవంతమైన మరో రెండు పిల్లులను కలిపి ఒకే బోనులో ఉంచారు.

బయటకు తీసుకొచ్చాక పరీక్షించగా.. ఓ పిల్లిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. అయితే.. కుక్కలు, పందులు, కోళ్లు లాంటి వాటికి ఈ వైరస్‌ సోకే అవకాశాలు లేవని అంటున్నారు. కాగా.. పిల్లుల నుంచి మనుషులకు సోకదు అని నిర్ధారణకు వచ్చే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. 
 
అందుకే చైనా నిషేధించిందా?
కరోనా విధ్వంసంతో చైనా.. పాఠం నేర్చుకున్నట్లే కనిపిస్తోంది. అక్కడి షెన్‌జేన్‌ నగరం.. పిల్లి, కుక్క మాంసం వినియోగంపై పూర్తిగా నిషేధం విధించింది. ప్రస్తుతానికిది ఒక్క నగరానికే పరిమితమైనా.. మిగిలిన నగరాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించే అవకాశాలు ఉన్నాయి.

అన్ని జంతువుల కన్నా కుక్కలు, పిల్లులు మనుషులకు అత్యంత సన్నిహితంగా ఉంటాయని, వీటిని తినడం మానవత్వం కాదనే ఉద్దేశంతోనే నిషేధం విధించామని వారు చెబుతున్నప్పటికీ.. కరోనాయే దీనికి కారణమన్నది బహిరంగ రహస్యం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments