ఏపీలో 149కు పెరిగిన కరోనా కేసులు

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (08:41 IST)
కరోనా మహమ్మారి ఏపీని వణికిస్తోంది. రోజు రోజు కు కేసుల సంఖ్య పెరుగుతోంది. గురువారం 41 కేసులు బయటపడ్డాయి. నెల్లూరు అత్యధికంగా 23 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 149కు చేరింది.

పరీక్షించిన వాటిల్లో 1321 నెగెటివ్‌గా తేలాయి. ఉదయం పదిగంటలకు 21 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నాలుగు గంటలకు మరో మూడు నిర్థారణ అయ్యాయి.

ఆరుగంటలకు ఎనిమిది మందికి పాజిటివ్‌గా తేలింది. రాత్రి పదిగంటలకు మరో 7 కేసులు బయటపడ్డాయి. ఇవన్నీ కూడా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారివిగానే నిర్థారణ అయింది. 
 
వైద్య సిబ్బందికి పిపిఇల సరఫరాకు చర్యలు : డాక్టర్‌ జవహర్‌ రెడ్డి 
వైద్య సిబ్బందికి అందుబాటులో ఉండేలా ప్రతి జిల్లా ఆస్పత్రికీ వెయ్యి వ్యక్తిగత సంరక్షణ పరికరాల(పిపిఇ)ను సరఫరా చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్‌.జవహర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నాలుగు పరీక్ష కేంద్రాలతోపాటు గుంటూరు, కడపలో మరో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments