Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవుడి మెదడులో న్యూరాలింక్ చిప్.. ఆశాజనక ఫలితాలు : ఎలాన్ మస్క్ వెల్లడి

ఠాగూర్
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (09:54 IST)
ఓ రోగి మెదడులో ఒక న్యూరాలింక్ చిప్‌ను అమర్చినట్టు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ చిప్ నుచి ఆశాజనక ఫలితాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మనిషి మెదడు, కంప్యూటర్‌ల మధ్య కన్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచడమే ఈ ప్రయోగ లక్ష్యమని ఆయన తెలిపారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సహ వ్యవస్థాపకుడిగా గత 2016లో నెలకొల్పిన సంస్థ న్యూరోటెక్నాలజీ కంపెనీ ఈ న్యూరాలింక్. ఇపుడు కీలకమైన ప్రయోగాన్ని చేపట్టింది. మొట్టమొదటిసారిగా ఒక పేషెంట్ మెదడులో చిప్‌ను అమర్చినట్టు పేర్కొంది. ఈ ప్రయోగం నుంచి ఆశాజనక ఫలితాలు వస్తున్నాయని ఎలాన్ మస్క్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
 
"నిన్న మొదటిసారి మనిషి మెదడులో న్యూరాలింక్‌ను అమర్చారు. పేషెంట్ కోలుకుంటున్నారు. ప్రారంభ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. నాడీ వ్యవస్థకు చెందిన కణాలను ఖచ్చితంగా గుర్తించడం తెలుస్తుంది అని ఎలాన్ మస్క్ ప్రకటించారు. మనిషి సామర్థ్యాలను ఉత్తేజం చేయడం, పార్కిన్సన్స్ వంటి నాడీ వ్యవస్థ వ్యాధులకు చికిత్స ప్రధాన లక్ష్యాలుగా ఈ ప్రయోగం కొనసాగుతుంది. మనుషులు, కృత్రిమ మేథస్సు మధ్య సహజీవన సంబంధాన్ని సాధించడం కూడా ఒక ఆశయంగా ఉందని గతంలో న్యూరాలింక్ కంపెనీ పేర్కొంది. మనిషి మెదడులో చిప్‌ను అమర్చేందుకు అమెరికా నియంత్రణ సంస్థ నుంచి గత యేడాది అనుమతి లభించడంతో ఈ ప్రయోగం చేపట్టారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం