Webdunia - Bharat's app for daily news and videos

Install App

విండోస్ 11 మెయిల్, శ్రీ క్యాలెండర్ యాప్‌లకు ఇక స్వస్తి!!

ఠాగూర్
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (09:42 IST)
విండోస్ 11 యూజర్లకు గ్లోబల్ ఐటీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ కీలక సమాచారాన్ని షేర్ చేసింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 'విండోస్ 11 మెయిల్', 'శ్రీ: క్యాలెండర్ యాప్‌'లకు స్వస్తి చెప్పనున్నట్టు తెలిపింది. ఈ రెండు సేవలు ఈ యెడాది డిసెంబరు నెలాఖరుతో నిలిచిపోతాయని వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్ యాప్‌ వినయోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. 
 
కంపెనీ వ్యూహాత్మక ప్రణాళికలో ఈ మార్పు భాగంగా ఉందని, 'ఆఫీస్ 365' టూల్స్‌లో భాగంగా ఔట్ లుక్ యాప్ సర్వీసును అందించనున్నట్టు తెలిపింది. దీంతో రోజువారీ కార్యకలాపాల కోసం విండోస్ 11 మెయిల్, క్యాలెండర్ యాప్లపై ఆధారపడుతున్నవారు డిసెంబర్ 31, 2024లోపు ఔట్లుక్‌లోకి మారాలని పేర్కొంది. పాప్-అప్ నోటిఫికేషన్ల ద్వారా యూజర్లకు సులభతరం చేయాలని యోచిస్తున్నట్టు ప్రకటనలో కంపెనీ పేర్కొంది. 
 
అయితే కటాఫ్ తేదీ వరకు సర్వీసులను యూజర్లు నిరాటంకంగా పొందొచ్చని కంపెనీ వివరించింది. కాగా 2024 ఆరంభం నుంచి మార్కెట్లోకి వచ్చే కొత్త విండోస్ 11 పరికరాల్లో మెయిల్ అప్లికేషన్‌గా డిఫాల్డ్ ఇన్‌స్టాల్ చేసి ఉంటుందని తెలిపింది. కాగా పాత విండోస్ 11కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఉండవని వివరించింది.
 
ఇక ఔట్‌లుక్ వెబ్ అప్లికేషన్ యూజర్లు అధునాతన ఫీచర్లను అందిస్తోంది. ఇది వేగంగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండనుంది. ఈ-మెయిల్ సేవలతో పాటు మై డే సెక్షన్‌లో సమగ్రమైన క్యాలెండర్, చేయాల్సిన పనుల లిస్టింగ్‌ ఫీచర్ లభించనున్నాయి. ఇక ఔట్ లుక్‌లో జీ-మెయిల్, యాహూ వంటి ప్రొవైడర్ల ద్వారా థర్డ్ పార్టీ ఈ-మెయిల్ అకౌంట్లను కూడా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments