తెలంగాణ రాష్ట్రంలో పని చేసే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. పలువురు అధికారుల పనితీరు ఏమాత్రం బాగోలేదని, ఇలాంటి వారు కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లేలోపు బదిలీలు ఉంటాయని హెచ్చరించారు.
ఆదివారం కలెక్టర్లతో ఆయన ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్ మాట్లాడుతూ, "ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రభుత్వం 'ప్రజాపాలన' కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కొంతమంది పనితీరు బాగాలేదని, సమావేశం పూర్తయి ఇంటికెళ్లేలోపు పలువురి బదిలీలు జరుగుతాయని వారితో అన్నట్టు తెలిసింది.
అందుకు అనుగుణంగానే సమావేశం పూర్తయిన కొద్దిసేపటికే రాష్ట్రంలోని ఏడుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా, సమావేశ సమయంలో చర్చించాల్సిన అంశాలు కాకుండా ఇతరత్రా విషయాలు లేదా సీఎంను, ప్రభుత్వాన్ని ప్రశంసించే విషయాలను అధికారులు ప్రస్తావించినపుడు.. "స్టిక్ టు ద పాయింట్" అంటూ సమావేశ అజెండాకే పరిమితం కావాలని పలువురు అధికారులకు రేవంత్ సూచించారు.
నారా లోకేశ్‌కు వైఎస్ షర్మిల క్రిస్మస్ కానుకలు... వైకాపాలో కలకలం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇపుడు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు క్రిస్మస్ కానుకలు పంపించారు. దీనికి ప్రతిగా ఆమెకు ధన్యవాదాలతో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ ఊహించని పరిణామాతో వైకాపా ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
"వైఎస్ఆర్ కుటుంబం మీకు శుభాకాంక్షలు తెలుపుతుంది... ఈ క్రిస్మస్ ఆనందమయంగా సాగిపోవాలి. మీకు 2024లో అంతా శుభం కలగాలి" అంటూ లోకేశ్‌కు షర్మిల పంపిన సందేశంలో పేర్కొన్నారు. షర్మిల క్రిస్మస్ కానుకలు పంపిన విషయాన్ని నారా లోకేశ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అంతేకాదు.. ఆమె పంపిన కానుకల పట్ల హర్షాన్ని వెలుబుచ్చారు.
ప్రియమైన షర్మిల గారూ... మీరు పంపిన అద్భుతమైన క్రిస్మస్ కానుకలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈ క్రిస్మస్‌తో పాటు, నూతన సంవత్సరాది కూడా సంతోషకరంగా సాగిపోవాలని నారా కుటుంబం శుభాకంక్షాలు తెలుపుతుంది" అని పేర్కొన్నారు.