Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ నుంచి కాంబోడియాకు 10 గంటలు విమానంలో ఏనుగు జర్నీ

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (16:10 IST)
ఓ ఏనుగును పాకిస్థాన్ నుంచి కాంబోడియాకు తీసుకెళ్లనున్నారు. పాకిస్థాన్‌లో 35 ఏళ్ల నుంచి ఒంటరిగా జీవిస్తున్న కావన్ అనే ఏనుగుకు ఎట్టకేలకు విముక్తి కలిగింది. అమెరికన్ సింగర్ చేర్ ఆదివారం కావన్‌ను పాకిస్థాన్ నుంచి కాంబోడియాకు తీసుకెళ్లనున్నారు. 
 
ఇంతకాలం ఒంటరిగా జీవిస్తూ వచ్చిన ప్రపంచంలోనే అతి పెద్ద ఏనుగైన కావన్‌ ఇకపై ఏనుగులతో ఉండే జూలో ఉండనుంది. కావన్‌ను విమానంలో తరలించనున్నట్టు అధికారులు వెల్లడించారు. కావన్ మొత్తం 10 గంటల పాటు విమానంలో ప్రయాణం చేయనుంది.
 
కాగా, శుక్రవారం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో చేర్ భేటీ అయ్యారు. అనంతరం కావన్‌ను కాంబోడియాకు పంపేందుకు సహాయపడినందుకు ట్విటర్ ద్వారా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మరోపక్క కావన్‌ను కాంబోడియాకు తరలించేందుకు ముందుకొచ్చినందుకు చేర్‌కు ఇమ్రాన్ ఖాన్ అభినందనలు తెలిపారు. 
 
అంతేకాకుండా భవిష్యత్తులో పాకిస్థాన్‌లో జరిగే పర్యావరణ కార్యక్రమాల్లో చేర్ పాల్గొనాల్సిందిగా ఇమ్రాన్ ఖాన్ కోరినట్టు పీఎంఓ ఆఫీసు ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా.. కావన్‌ను పాకిస్థాన్ నుంచి కాంబోడియాలోని సియెమ్ రీప్ ప్రావిన్స్‌కు తరలించనున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments