Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్ కొత్త పెళ్లి జంటకు ఏకే-47 గిఫ్ట్.. వీడియో వైరల్

Advertiesment
పాకిస్థాన్ కొత్త పెళ్లి జంటకు ఏకే-47 గిఫ్ట్..  వీడియో వైరల్
, శనివారం, 28 నవంబరు 2020 (14:06 IST)
పాకిస్థాన్‌లో ఓ పెళ్లి జంట ఏకే-47ను బహుమతిగా పొందింది. పాకిస్థాన్‌కి చెందిన ఒక జంట మాత్రం వెరైటీ బహుమతిని అందుకున్నారు. ఆ జంటకు ఒక మహిళ ఎకె47 రైఫిల్ బహుమతిగా ఇచ్చింది. ఆ బహుమతి చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు.

కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో వైరల్‌గా మారింది. 30 సెకన్ల వ్యవధి గల ఈ వీడియోలో సదరు మహిళ వరుడికి ఏకే-47 రైఫిల్‌ను బహుమతిగా ఇవ్వడాన్ని చూడవచ్చు. అయితే, వరుడు మాత్రం ఏకే-47 బహుమతిని చూసి ఏ మాత్రం ఆశ్చర్యపోకుండా ముఖం మీద చిరునవ్వుతో దాన్ని అందుకోవడం గమనార్హం. 
 
కాగా, ఈ వీడియోను ''వివాహ బహుమతిగా కలాష్నికోవ్ రైఫిల్" అనే ట్యాగ్ లైన్‌తో ట్విట్టర్లో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోని పరిశీలిస్తే వివాహం పాకిస్థాన్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ట్విట్టర్‌లో వైరల్ అయిన ఈ పోస్టును ఇప్పటివరకు 1.88 లక్షల మందికి పైగా చూడగా... 2.5 వేల మంది లైక్స్ ఇచ్చారు. వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. సీఎం వైఖరేంటో?: ఉండవల్లి