Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాల్లో ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయి!

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (07:51 IST)
కారులో అలా ఆకాశానికి వెళ్లి... ఇలా షికారు చేసే రోజులు వచ్చేశాయి.. ఘరో రెండేళ్లలో మనం దీనిని చూడబోతున్నాం. కాదు,కాదు.. అనుభవించబోతున్నాం. నెదర్లాండ్‌కు చెందిన 'పాల్‌ వీ' అనే సంస్థ గాల్లో ఎగిరే కారును సిద్ధం చేసింది.

ఈ పాల్‌ వీ కారు తయారీకి 20 ఏళ్లు పట్టిందిమరి. యూరప్‌లో అన్ని రకాల ప్రభుత్వ అనుమతులను కంపెనీ పొందింది. ఈ కారు వినియోగదారులకు అందుబాటులోకి రావడానికి 2022 వరకు ఆగాల్సిందే.

అప్పటికి కారును అందుబాటులోకి తేవడానికి కంపెనీ అన్ని సన్నాహాలు చేస్తోంది. ఈలోపు విమానంగా ఉపయోగించేందుకు అవసరమైన అన్ని అనుమతులను సాధించే ప్రయత్నాల్లో కంపెనీ నిమగ్నమయింది.
 
ఈ ఎగిరే కారు పేరు 'ది లిబర్టీ'. కారు బరువు తగ్గడానికిగాను మూడు చక్రాలతో ఈ కారును తయారు చేశారు. నాలుగు చక్రాల వాహనాలతో పోలిస్తే ఈ 3 చక్రాల వాహనానికి లైసెన్సు కూడా సులువుగా లభిస్తుందండోయ్. రోడ్డుపై వెళ్లేటప్పుడు ' ది లిబర్టీ ' రెక్కలు పైభాగంలో ముడుచుకొని ఉంటాయి.

విమానంగా మారేటప్పుడు రెక్కలు విచ్చుకుంటాయి. 100 హెచ్‌పి ఉన్న ఇంజిన్‌తో ఇది తొమ్మిది సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇంకేముంది.. ఎంచక్కా.. కారులో మహాస్పీడ్‌తో దూసుకుపోవచ్చు.
 
రెండు సీట్లు మాత్రమే ఈ కారులో ఉంటాయి. గాలిలో ఇది గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. టేకాఫ్‌ కోసం వెయ్యి అడుగుల రన్‌వే అవసరం. ల్యాండ్‌ అయ్యేందుకు వంద అడుగుల దారి సరిపోతుంది. ఇంధన ట్యాంకులో వంద లీటర్ల ఇంధనాన్ని నింపుకొంటే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు.

అదనంగా మరో అరగంట పాటు నడిచేందుకు రిజర్వ్‌ ట్యాంకు కూడా ఉందండోయ్. రోడ్డుపై వెళ్లేటప్పుడు మైలేజీ లీటర్‌కు 13 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments